టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ‘గామి ‘.. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపిస్తాడు..దర్శకుడు విద్యాధర్ కటిగకు ఇది డ్రీమ్ ప్రాజెక్టుగా ఉంది. ఈ చిత్రం కోసం అతడు ఆరేళ్లుగా పని చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. మార్చి 8వ తేదీన గామి సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలో నేడు ఈ సినిమా నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు..
గతంలో విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి.. ఇక ట్రైలర్ రిలీజ్ తరువాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రతిఒక్కరు ఈ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు.. ఇప్పుడు మరోసారి హైప్ ను క్రియేట్ చేసేందుకు సాంగ్ ను రిలీజ్ చేశారు..
ఈ8న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగం గానే నేడు ‘శివమ్’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. శివ క్షేత్రం శ్రీశైలంలో ఈ సాంగ్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. నరేష్ కుమారన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా శంకర్ మహదేవన్ పాటని పాడారు. శ్రీమణి లిరిక్స్ ని అందించారు.. గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఒకసారి వినెస్సాయ్యండి..