NTV Telugu Site icon

G20 Food Festival: టేస్ట్ ది వరల్డ్.. ఢిల్లీలో 2-రోజుల పాటు జీ20 ఇంటర్నేషనల్ ఫుడ్ ఫెస్టివల్

Food Festival

Food Festival

G20 Food Festival: న్యూఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో రెండు రోజుల పాటు జరగనున్న జీ20 అంతర్జాతీయ ఫుడ్ ఫెస్టివల్‌ను కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శనివారం ప్రారంభించారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (NDMC) నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్‌ థీమ్‌ను ‘టేస్ట్ ది వరల్డ్’ అంటూ ప్రకటించారు. ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ నాలుగు జీ20 దేశాలు చైనా, టర్కీ, జపాన్, మెక్సికోలు పాల్గొంటున్నాయి. మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఇది ఎన్‌డీఎంసీ జీ20 ఫుడ్ ఫెస్టివల్ మాత్రమే కాదు, దేశానికి ఫుడ్ ఫెస్టివల్ కూడా అని అన్నారు. ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. రోజువారీ ఆహార పదార్థాలలో మిల్లెట్లను చేర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. మిల్లెట్‌లతో తయారు చేసిన రెడీ-టు-ఈట్ వంటకాలు, స్నాక్స్ కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో ఉన్నాయని కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు.

ప్రపంచ ఆహార ప్రియులు ఈ ఫెస్టివల్‌ ఏకం అవుతారని కేంద్రమంత్రి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ రెండు రోజుల కార్యక్రమంలో భారత్‌లోని 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన వంటకాలను రుచి చూడవచ్చని మంత్రి స్పష్టం చేశారు. గుజరాత్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, బీహార్, పంజాబ్, కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన వంటకాలు ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌లో లభిస్తాయని చెప్పారు.

Ravindra Jadeja: జడేజాకు షాకిచ్చిన ఐసీసీ.. ఆ పని చేసినందుకు!

తాజ్ ప్యాలెస్, తాజ్ మహల్, ది కన్నాట్, తాజ్ అంబాసిడర్స్, లే మెరిడియన్, ఐటీసీ మౌర్య, ది పార్క్ సహా 11కి పైగా ప్రముఖ హోటళ్లు ఈ కార్యక్రమంలో తమ సంతకంతో కూడిన ఆహార పదార్థాలను అందజేయనున్నాయి. ‘అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం’ థీమ్‌పై వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఫుడ్ ఫెస్టివల్‌లో ఎనిమిది స్టాళ్లను కూడా ఏర్పాటు చేసింది. తీహార్ బేకింగ్ స్కూల్‌తో పాటు ఢిల్లీ జైలు విభాగం కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటోంది. ఎన్‌ఎండీసీ పాల్గొనే వారందరికీ స్టాల్‌ కోసం స్థలం, మద్దతును అందిస్తోంది. ఈ ఫుడ్ ఫెస్టివల్ జీ20 సమ్మిట్‌కు భారత్ అధ్యక్షత వహించడం, అంతర్జాతీయ వంటకాల గురించి అవగాహన కలిగిస్తుందని ఎన్‌ఎండీసీ పేర్కొంది.