NTV Telugu Site icon

Gaurav Gogoi: మోడీ ప్రభుత్వం ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు..

Gogai

Gogai

కేంద్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వరకూ ఎలాంటి అనుమానం లేదు.. కానీ ఆ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ ఎన్నాళ్లు నడుపుతారు అనేది మాత్రం ఊహించలేమని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ చెప్పుకొచ్చారు. ప్రధాన మంత్రిగా మోడీ ఎన్నాళ్లు ఉంటారో కూడా తెలియదన్నారు. ఆయన ఎక్కువ కాలం ప్రధానిగా ఉండక పోవచ్చు, ఐదేళ్లూ ఈ ప్రభుత్వం నిలబడదని తెలిపారు.

Read Also: Andhra Pradesh: ప్రభుత్వంలో కీలక మార్పులు అధికారుల నియామకంపై చంద్రబాబు కసరత్తు

అయితే, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడానికి విశాల హృదయం, ఓపెన్ మైండ్, అందరినీ కలుపుకొని పోయే లక్షణాలు ఉండాలి.. అలాంటి లక్షణాలు మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్ సింగ్, దివంగత నేత అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయికి ఉన్నాయి.. కానీ, నరేంద్ర మోడీకి లేవని గౌరవ్ గొగొయ్ విమర్శలు గుప్పించారు. దీంతో ఆయన ప్రధానమంత్రిగా ఐదేండ్ల కాలం పాటు పని చేయడం ప్రశ్నార్థకమేనని వెల్లడించారు. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రజలకు గొగొయ్ కృతజ్ఞతలు చెప్పారు.

Read Also: CS Shanti kumari: వరద నీరు చేరకుండా చర్యలు తీసుకోండి.. అధికారులకు సీఎస్‌ ఆదేశం

ఇక, లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 293 సీట్లు రాగా, అందులో భారతీయ జనతా పార్టీకి 240 స్థానాలు వచ్చాయి. దీంతో ఎన్టీయేలోని మిత్రపక్షాల సహాయంతో మోడీ ప్రధాన మంత్రిగా రేపు ఢిల్లీలోని రాజ్ భవన్ లో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇక, ఇండియా కూటమికి 236 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీకి 99 రాగా.. ఒక స్వాతంత్ర అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో మొత్తం సెంచరీ మార్క్ ను అందుకుంది.