NTV Telugu Site icon

Prabhas-Mohanababu: మోహన్‌ బాబును ఆట పట్టించిన ప్రభాస్.. వీడియో వైరల్

Prabahs

Prabahs

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.. కన్నప్ప సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.. మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ప్రభాస్‌, మోహన్‌బాబు, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌, శరత్‌ కుమార్‌, కాజల్‌ వంటి స్టార్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో.. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ షురూ చేశారు. ముంబయిలో అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. అక్కడ సెలబ్రిటీలకు, మీడియాకి టీజర్‌ని చూపించారు. మార్చి 1న టీజర్‌ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

Read Also: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటపై కొనసాగుతున్న న్యాయ విచారణ..

మరోవైపు.. సినిమా ప్రమోషనల్స్‌లో భాగంగా.. మంచు విష్ణు ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో మోహన్‌బాబు, ప్రభాస్‌ మధ్య ఫన్నీ కన్వర్జేషన్‌ ఆకట్టుకుంటుంది. ముక్కుల గురించి మాట్లాడారు. మోహన్‌బాబు ముక్కుని ఉద్దేశించి.. నీ ముక్కు షార్ప్ నా, నా ముక్కు షార్ప్ నా అని ప్రభాస్ అన్నారు. ‘నేను చిన్నప్పుడు నా ముక్కుతో టమాటాలు కోసాను. నువ్వు నీ ముక్కుతో టమాటాలు కోసావా అని మోహన్ బాబు అడుగుతే లేదంటాడు. అయితే నా ముక్కే షార్ప్’ అని ప్రభాస్‌ ఆటపట్టిస్తాడు. ఆ విషయాన్ని మళ్లీ చెప్పు అని మంచు విష్ణు అంటారు. అయితే.. మోహన్‌బాబు, ప్రభాస్‌ల మధ్య ఈ కన్వర్జేషన్‌ని వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

Read Also: Israel: ఇజ్రాయిల్‌లో ఉగ్రదాడి.. పాదచారులపైకి వాహనం..

ప్రభాస్‌, మంచు మోహన్‌బాబు మధ్య మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు కలిసి `బుజ్జిగాడు` సినిమాలో నటించారు. మోహన్‌బాబు హీరోయిన్‌కి అన్నగా నటించాడు. అయితే.. అప్పట్నుంచి వీరిద్దరి మధ్య ఈ అనుబంధం కొనసాగుతుంది. అంతేకాకుండా.. ప్రభాస్‌, మోహన్‌బాబుని బావా అని పిలుస్తాడు. `బుజ్జిగాడు` సినిమాలో మోహన్‌బాబు హీరోయిన్‌ త్రిషకి అన్నగా నటించడంతో.. త్రిష తనకు లవర్‌ కావడంతో ప్రభాస్ బావ అని పిలుస్తాడు ప్రభాస్‌. అప్పుడు స్టార్ట్ అయిన ఈ `బావా` పిలుపు ఇప్పటికీ అంటూనే ఉన్నాడు.