లక్కీ భాస్కర్ మూవీలో హీరో బ్యాంక్ క్యాషియర్‌గా పని చేస్తుంటాడు. చాలీ చాలని జీతంతో, అప్పులతో జీవితం గడుపుతుంటాడు. బ్యాంక్‌లో ఎంత కష్టపడినా ప్రశంసలు వస్తాయి తప్ప ప్రమోషన్ రాదు. ఈ క్రమంలో హీరో బ్యాంకులోని డబ్బును కాజేసి గూడ్స్ స్మగ్లింగ్ చేస్తాడు. దీంతో అవసరాలకు సరిపడా డబ్బు వస్తుంది. ఇక్కడ కూడా ఎస్బీఐ బ్యాంక్ క్యాషియర్ లక్కీ భాస్కర్ లాగ మారి రూ. 80 లక్షల నగదు, రూ. 2 కోట్లు విలువ చేసే గోల్డ్ తో జంపయ్యాడు.
Also Read:Cyber Crime: 81 ఏళ్ల వృద్ధుడిని వాట్సాప్ కాల్ ద్వారా హనీ ట్రాప్.. రూ. 7 లక్షలు స్వాహా
ఈ ఘటన మంచిర్యాల చెన్నూరు లోని ఎస్ బీ ఐ బ్రాంచి 2 బ్యాంక్ లో చోటుచేసుకుంది. విషయం బయటకు పొక్కడంతో అధికారులు విచారణ చేపట్టారు. చెన్నూరు పట్టణంలోని ఎస్బిఐ బ్యాంక్ బ్రాంచ్ 2 లో అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు.. గత నెల నుంచి లాకర్ తాళాలు తనవద్దే పెట్టుకున్న బ్యాంకు క్యాషియర్ నరిగె రవీందర్.. ఉదయం నుండి బ్యాంకును లోపల నుండి మూసి వేసి పోలీసులు, బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టారు. క్యాషియర్, బ్యాంక్ మేనేజర్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. ఆడిట్ కొనసాగుతున్నట్లు సమాచారం.
