ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందిన ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రథయాత్ర గడువు సమీపిస్తోంది. అత్యంత ప్రాచీనమైన ఈ రథయాత్రను విజయవంతం చేయడానికి ఆలయ కమిటీ చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకోనున్నారు. వారందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలను తీసుకుంటోంది.
Also Read: Earthquake: లేహ్-లడఖ్‌లో భూకంపం.. 4 గంటల్లో రెండవసారి కంపించిన భూమి
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్ల పక్షం రెండో రోజున పూరీ జగన్నాథుడిని ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. జగన్నాథుడితో పాటు బలరాముడు, సుభద్రలను వేర్వేరు రథాల మీద పూరీ నగరంలో ఊరేగిస్తారు. ప్రపంచంలోనే అతి పురాతనమైన రథయాత్రగా భావిస్తారు. ఉత్సవ మూర్తులకు సాక్షాత్ గర్భగుడిలో ఉండే స్వామివార్లనే ఊరేగించడం దీని ప్రత్యేకత.
Also Read: Minister KTR : మత పిచ్చి, కులపిచ్చితో కలహాలు సృష్టించడమే బీజేపీకి తెలుసు
పూరీ జగన్నాథుడి రథయాత్రను కనులారా వీక్షించడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర ప్రజలు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలకు హాజరవుతుంటారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వేలాదిమంది పూరీ జగన్నాథుడిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. ఈ నెల 20వ తేదీన జరిగే ఈ రథోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. ఏపీ, తెలంగాణల్లోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఆయా రైళ్లన్నీ పూరీకి బయలుదేరి వెళ్తాయి. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌తో కూడిన ఓ ప్రకటనను దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేశారు.