FSSAI: ఛాయ్.. చాలామందికి ఉదయాన్నే దీనిని తాగితే కాని రోజు మొదలవ్వద్దు. అయితే తాజాగా భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల సంస్థ (FSSAI) ఈ ఛాయ్ విషయంలో ఓ కీలకమైన స్పష్టీకరణ ఇచ్చింది. ‘ఛాయ్’ అనే పేరు కేవలం కామెల్లియా సినెన్సిస్ (Camellia sinensis) మొక్కతో తయారైన ఉత్పత్తులకే వర్తిస్తుందని పేర్కొంది. హెర్బల్ టీ, రూయిబోస్ టీ, ఫ్లవర్ టీ వంటి పానీయాలను ‘ఛాయ్’గా పిలవడం తప్పుదారి పట్టించే ప్రకటన (మిస్ బ్రాండింగ్)గా పరిగణిస్తామని FSSAI తెలిపింది.
Vaibhav Sooryavanshi History: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. సచిన్, కోహ్లీకి కూడా సాధ్యంకాలే!
FSSAI ప్రకారం కాంగ్రా టీ, గ్రీన్ టీ, ఇన్‌స్టెంట్ టీ వంటి ఉత్పత్తులు కూడా తప్పనిసరిగా కామెల్లియా సినెన్సిస్ నుంచే తయారై ఉండాలి. ఈ మొక్కతో తయారు కాని పానీయాలపై ‘టీ/ఛాయ్’ అనే పదాన్ని ఉపయోగించకూడదు. అలా ఉపయోగిస్తే అవి ప్రోప్రైటరీ ఫుడ్ లేదా నాన్-స్పెసిఫిక్ ఫుడ్ నిబంధనలు, 2017 కిందకు వస్తాయని తెలిపింది. ప్రతి ఆహార ప్యాకెట్ ముందు భాగంలో ఆహార పదార్థం సంబంధించిన నిజమైన, సరైన పేరు స్పష్టంగా ఉండాలి అని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు తయారీదారులు, విక్రేతలు, దిగుమతిదారులు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫార్మ్‌లకు కూడా తప్పనిసరి చేసింది FSSAI.
CM Chandrababu: దేశానికి సుపరిపాలనను పరిచయం చేసిన నేత అటల్ జీ..
ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI హెచ్చరించింది. రాష్ట్రాల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ ఆదేశాల అమలుపై కఠినంగా పర్యవేక్షణ చేస్తారు. ఈ నిర్ణయంతో కంపెనీలు తమ ఉత్పత్తి అసలు ఛాయ్ (Camellia sinensis ఆధారితమా?) లేదా కేవలం హర్బల్ ఇన్ఫ్యూషనా అన్న విషయాన్ని వినియోగదారులకు స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుంది. నియమాలు పాటించని సంస్థలపై రాబోయే రోజుల్లో చర్యలు తప్పవని FSSAI స్పష్టం చేసింది.
