FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FSSAI Action on Nestle: శిశు పోషణ, పసిపిల్లల ఆహారం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంతటి ప్రముఖ సంస్థకైనా చిక్కులు తప్పవు. భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) ప్రముఖ దిగ్గజ కంపెనీ అయిన ‘నెస్లే ఇండియా’కు షాక్ ఇచ్చింది. నెస్లే తయారుచేసే మూడు రకాల పసిపిల్లల న్యూట్రిషన్ ఉత్పత్తులపై నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో లీగల్ నోటీసులు జారీ చేసి, లీగల్ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ అంశంపై విచారణ ప్రారంభమైంది.
అసలు ఏం జరిగిందంటే..?
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో నెస్లే ప్రమోట్ చేసుకుంటున్న ప్రచార ప్రకటనలు, ఉత్పత్తుల నాణ్యతను FSSAI నిశితంగా పరిశీలించింది. ఇందులో ప్రధానంగా ‘నాన్ ఎక్సెల్లా ప్రో స్టేజ్ 1’ (NAN Excella Pro Stage 1) ప్రచారంలో “5 HMOs”, “వే ప్రోటీన్” వంటి విశేషాలు ఉన్నట్లు నెస్లే క్లెయిమ్ చేసింది. అలాగే ‘లాక్టోజెన్ ప్రో 1’ (Lactogen Pro 1) విషయంలోనూ అందులోని ‘వే ప్రోటీన్’ త్వరగా అరుగుతుందని ప్రచారం చేశారు. దీనిపై FSSAI వివరణ కోరగా, నెస్లే ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. చిన్నపిల్లల ఆహార అమ్మకాలను పెంచుకోవడానికి ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చేయడం ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ 2020’ నిబంధనలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు.
Also Read
- CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
- Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
- AP Economic Regions: యువతకు లక్షలాది ఉద్యోగాలే లక్ష్యం.. మూడు ఎకనమిక్ రీజియన్లపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష
శిశువుల ఆహారం విషయంలో ఇంత కఠినంగా ఎందుకు ఉంటారంటే..?
పసిపిల్లల ఎదుగుదలలో ఆహారం అత్యంత చాలాకమైనది. మార్కెటింగ్ జిమ్మిక్కులు చూసి తల్లిదండ్రులు తప్పుదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే భారత్‌లో కఠిన చట్టాలు ఉన్నాయి. 1992 నాటి ‘ఇన్ఫాంట్ మిల్క్ సబ్స్టిట్యూట్స్ యాక్ట్’ ప్రకారం శిశు ఆహారాల ప్రకటనలు, ప్రచారాలపై స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. వ్యాపార ప్రకటనలు తల్లిదండ్రుల నిర్ణయాలను ప్రభావితం చేయకూడదనేదే దీని ముఖ్య ఉద్దేశం. ఇక, కేవలం ప్రచార ఆర్భాటాలే కాకుండా, పోషకాల పరిమాణంలోనూ ఒక ఉత్పత్తి విఫలమైంది. నెస్లే తయారుచేసిన ఒక ఫాలో-అప్ ఫార్ములా (Follow-up Formula) శాంపిల్‌ను ల్యాబ్‌లో పరీక్షించగా, అందులో ఉండాల్సిన ‘బయోటిన్’ (విటమిన్ B7) ప్రమాణాలు తగ్గట్లుగా లేవు. అనుమానంతో దీన్ని రెఫరల్ ల్యాబొరేటరీకి పంపగా, అక్కడ కూడా అదే విషయం నిర్ధారణ అయింది. పసిపిల్లల శరీర విధులకు విటమిన్ B7 చాలా అవసరం. నిబంధనల ప్రకారం నిర్దేశించిన మోతాదు లేకపోవడంతో దీన్ని ‘సబ్‌స్టాండర్డ్’ (ప్రమాణాలకు సరిపోనిది)గా పరిగణించారు. మొత్తంగా నెస్లే ఇండియాపై మూడు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. ప్రచార ఆరోపణలపై రెండు, పోషకాల లోపంపై ఒక కేసు ఉన్నాయి. సంబంధిత ప్రాధికార సంస్థ విచారణ పూర్తయిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం రానుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
-
Ravindra Jadeja: జడేజాను పక్కన పెట్టడానికి అసలు కారణం ఇదే.. కోచ్ క్లారిటీ!
-
Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. ‘నషా ముక్త్ భారత్ యాత్ర’కు కింగ్ నాగార్జున మద్దతు..
-
PM Modi: 50 కోట్ల మంది పేదరికాన్ని జయించారు.. రాహుల్ గాంధీకి ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్!
-
Punjab: ఒక్కసారిగా కూలిన ఇనుప వంతెన.. కాలువపై చిక్కుకున్న రెండు భారీ లారీలు
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!