MCC NEET UG Counselling 2024: NEET UG 2024 కౌన్సెలింగ్ ఈరోజు (14 ఆగస్టు) నుండి ప్రారంభమవుతుంది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ప్రక్రియ నాలుగు రౌండ్లు ఉంటుంది. మొదటి రౌండ్‌కు రిజిస్ట్రేషన్, చెల్లింపు ఆగస్టు 14 నుండి 21 వరకు జరుగుతుంది. అయితే సీట్ల కేటాయింపు ప్రక్రియ ఆగస్టు 21, 22 తేదీలలో జరుగుతుంది. కౌన్సెలింగ్ సమయంలో అభ్యర్థులు వివిధ పత్రాలను సమర్పించాలి. ఎంపికలను నింపే సమయంలో శ్రద్ధ వహించాలి. సరైన విధానం, సమయానుకూల చర్య ద్వారా మీరు ఇష్టపడే సీటును పొందేలా చూస్తుంది.
ఇక రిజిస్ట్రేషన్ విండో ఆగస్ట్ 20, 2024న మూసివేయబడుతుంది. అంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. అలాగే దరఖాస్తు రుసుము చెల్లింపు కోసం విండో కూడా నేటి నుండి తెరిచి ఉంటుంది. ఇది కూడా 20 ఆగస్టు 2024న మధ్యాహ్నం 12 గంటలకు మూసివేయబడుతుంది. ఆప్షన్ లను పూరించే, లాక్ చేసే ప్రక్రియ ఆగస్టు 16 నుండి ప్రారంభమవుతుంది. ఇది ఆగస్టు 20, 2024 వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత, 2024 ఆగస్టు 21 నుండి 22 మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది ఇక రౌండ్ 1 సీట్ అలాట్‌మెంట్ ఫలితం 23 ఆగస్టు 2024న ప్రకటించబడుతుంది. సీట్లు కేటాయించబడే అభ్యర్థులు 2024 ఆగస్టు 24 నుండి 29 వరకు కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తదనంతరం, అభ్యర్థుల డేటా 30 నుండి 31 ఆగస్టు 2024 వరకు MCC ద్వారా ధృవీకరించబడుతుంది.
విద్యార్థులు NEET UG పరీక్షలో అర్హత సాధించినట్లయితే, మీరు ఈ కౌన్సెలింగ్ రౌండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రక్రియ చాలా సులభం. క్రింద ఇచ్చిన దశలను అనుసరించండి.. సులువుగా మీ పనిని చేసుకోండి.
* MCC mcc.nic.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
* హోమ్ పేజీలో “MCC NEET UG కౌన్సెలింగ్ 2024 రిజిస్ట్రేషన్” లింక్‌పై క్లిక్ చేయండి.
* రిజిస్ట్రేషన్ వివరాలను పూరించండి, ఆపై సమర్పించండి.
* అప్పుడు మీ ఖాతాకు లాగిన్ అవ్వండి.
* దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. చివరిలో దరఖాస్తు రుసుమును చెల్లించండి.
* సమర్పించుపై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయండి.
* భవిష్యత్తు అవసరాల కోసం దాని ప్రింట్ అవుట్ ని మీ వద్ద ఉంచుకోండి.