Site icon NTV Telugu

Nagoba Jatara: నేడే నాగోబా జాతర మొదలు.. మహా పూజతో జాతర షురూ

Nagobu

Nagobu

Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని నాగోబా గుడి వద్ద నేడు నాగోబా మహా పూజల జాతర ఘనంగా ప్రారంభం కానుంది. రాత్రి మహాపూజతో జాతర ఆరంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు కొనసాగుతుంది. మెస్రం వంశీయులు సంప్రదాయరీతిలో ఈ జాతరలో పాల్గొననున్నారు. నాగోబా మహా పూజ ప్రత్యేకంగా నాగోబా దేవుడి పూజార్చనతో ప్రారంభమవుతుంది. మహాపూజ అనంతరం తెల్లవారుజామున కొట్టకోడళ్ళ బేటింగ్‌ (దేవుడికి పరిచయం చేసే సంప్రదాయం) నిర్వహించనున్నారు. ఇది వంశీయ సంప్రదాయానికి ఎంతో ప్రత్యేకమైన ఆచారం.

Also Read: Nalgonda: బీఆర్‌ఎస్‌ రైతు మహా ధర్నా.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న కేటీఆర్‌

జాతరలో భాగంగా, కేస్లాపూర్‌లోని మర్రిచెట్టును పూజించిన అనంతరం మెస్రం వంశీయులు గోవాడ్‌ వద్దకు చేరుకుంటారు. కోనేరు నుంచి కొత్త కుండలతో నీటిని తీసుకొచ్చి పుట్టను తయారు చేయడం వంశ ఆడపడుచులు, అల్లుళ్ల సంప్రదాయ విధిగా నిర్వహిస్తారు. మహాపూజ తర్వాత తెల్లవారుజామున కొట్టకోడ్ళ బేటింగ్, మరుసటి రోజు పెర్సాపెన్, భాన్‌పేన్ పూజలు, చివరగా ముగింపు పూజ మండగాజలి పూజతో మెస్రం వంశీయుల సంప్రదాయ పూజలు ముగుస్తాయి. ఈ నెల 31న నాగోబా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈ దర్బార్‌లో నాగోబా వంశీయులు తమ సమస్యలను వర్గపెట్టి చర్చిస్తారు. ఇది వంశీయుల సమాగమానికి ప్రత్యేకమైన భాగం.

ఇక ఈ జాతరను నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల రాకపోకలు సులభంగా ఉండేలా ఏర్పాట్లు చేయడంతో పాటు, పూజా కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమకూర్చారు. ఈ నాగోబా జాతర మెస్రం వంశీయుల సంప్రదాయ ఆచారాలను నిలబెట్టడంలో కీలకంగా ఉంటుంది. భక్తులందరికీ ప్రత్యేక అనుభూతిని అందించే ఈ జాతర మహత్తరంగా సాగనుంది.

Exit mobile version