NTV Telugu Site icon

SVC 58 : వైరటీ పోస్టర్ తో వెంకటేష్, అనిల్ రావిపూడి చిత్రం అనౌన్స్మెంట్..

Svc 58

Svc 58

SVC 58 : టాలీవుడ్ అగ్రతలో ఒకరైన విక్టరీ వెంకటేష్ చివరిసారిగా సైంధవ్ సినిమాలో కనిపించారు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఫ్యామిలీ మెన్ గా పేరుపొందిన విక్టరీ వెంకటేష్.. ఆ తర్వాత సినిమా గురించి విశేషాలను తెలుసుకోవడానికి ఆయన అభిమానులు సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా విక్టరీ వెంకటేష్ తన తదుపరి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ తెలిపారు. మరోసారి డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించబోతున్నారు. ఈ విషయం సంబంధించి తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చారు చిత్ర మేకర్స్. సోమవారం నాడు సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు.

Bharateeyudu 2 : భారతీయుడు 2 నుండి వావ్.. అనేలా “క్యాలెండర్ సాంగ్”

విడుదల చేసిన పోస్టర్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా, వైరటీగా అనిపిస్తుంది. ఈ పోస్టర్లో ఓ తుపాకీకి తాళిబొట్టును, అలాగే రోజా ను జత చేసి ఉంచారు. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. దిల్ రాజు బ్యానర్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి తాత్కాలికంగా SVC 58 అనే టైటిల్ పెట్టి పోస్టర్ ను విడుదల చేశారు. జూలై 3 బుధవారం నాడు సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలతో షూటింగ్ మొదలుకానుంది. బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా అతి త్వరలో వెల్లడి కాబోతున్నాయి.

Nandamuri Mokshagna: ‘వచ్చేస్తున్నా’.. అంటూ అరంగేట్రానికి సిద్దమైన బాలయ్య కుమారుడు..

Show comments