NTV Telugu Site icon

Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్ కోల్పోయిన విరాట్, సమంత, షారుఖ్, జగన్, పవన్ కల్యాణ్

Tweeter

Tweeter

ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ చెప్పింది చేస్తాడు అని అందరికీ తెలుసు.. అయితే ట్విట్టర్ బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే అని చెప్పాడు.. ప్రస్తుతం దాన్ని అమలు చేస్తున్నాడు. అయితే నిన్నటి నుంచి పలువురు రాజకీయ నాయకులు, సినీనటులు ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయారు. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, నటినటులు సమంత, అలియా భట్, షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రాజకీయ నాయకుల్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ బ్లూటిక్ ను కోల్పోయిన వారి జాబితాలో ఉన్నారు.

Also Read : Allu Arjun : కూతురితో అల్లు అర్జున్.. క్యూట్ వీడియో

నిన్నటి నుంచే వారి ఖాతాలకు బ్లూ టిక్ కనపడట్లేదు. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కోనుగోలు చేయకముందు ఒకలా.. కొనుగోలు చేసిన తర్వాత ఒకలా ఆ మైక్రోబ్లాగింగ్ సైట్లో నిబంధనలు ఉన్నాయి. ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేయకముందు భారతీయ యూజర్లకు ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ ఉచితంగా బ్లూటిక్ అందించేది. ఎలాన్ మస్క్ వచ్చాక రూల్స్ మారిపోయాయి. బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందే.. సబ్ స్క్రైబ్ చేసుకోని వారి ఖాతాకు బ్లూటిక్ తొలగిస్తమని ఇటీవలే ట్విట్టర్ ప్రకటించింది. దీంతో నిన్న అన్నంత పనీ చేసింది. ప్రముఖుల ఖాతాల నుంచి బ్లూటిక్ ఎగిరిపోయింది.

Also Read : Naroda Gam massacre: నరోదా గామ్ ఊచకోతలో 67 మంది నిర్దోషులే అని ప్రకటించిన కోర్టు.. అసదుద్దీన్ మండిపాటు

మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్న ప్రముఖులు ట్విట్టర్ చర్యతో షాక్ అవుతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ట్విట్టర్ నిబంధనలు మార్చి.. మళ్లీ సైన్ అప్ చేసుకోవాలని ప్రకటించినప్పటికీ చాలా మంది చేసుకోలేదు. టాలీవుడ్ లో మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు ముందుగానే జాగ్రత్త పడడంతో వారి బ్లూటిక్ పోలేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ యూజర్లకు షాకులు ఇస్తూనే ఉంది. పలు మీడియా సంస్థలకు కూడా బ్లూటిక్ తొలగించింది. కొన్ని సంస్థలు ట్విట్టర్ కు దూరంగా ఉంటామని కూడా ప్రకటించాయి.

Show comments