Mohammed Siraj: మొహమ్మద్ సిరాజ్.. బౌలింగ్ లో తన సత్తా ఏంటో నేడు మరోసారి ప్రపంచానికి రుచి చూపించాడు నేడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ మహమ్మద్ సిరాజ్ కెరియర్ లో చిరస్థాయిగా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహంలేదు. ఎందుకంటే అతడి ప్రదర్శన అలా ఉంది మరి ఈ సిరీస్ లో. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ మ్యాజిక్ గురించి ఎంత చెప్పుకున్న తక్కవే. ఈ మ్యాచ్ నిజంగా అభిమానులకు అసలైన టెస్ట్ క్రికెట్ అనుభూతిని అందించిందనడంలో ఎంటువంటి సందేహం లేదు.
ఓవల్ మైదానంలో జరిగిన ఈ ఐదో టెస్ట్ ఆఖరి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లండ్‌పై భారత్ 6 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. సిరీస్‌ను 2-2తో సమం చేస్తూ టీమిండియా గొప్పగా ముగించింది. అయితే ఈ విజయంలో ప్రధానమైన పాత్ర పోషించిన వాడిలో ప్రధానంగా బ్యాటింగ్ లో కెప్టెన్ గిల్ లీడ్ రోల్ తీసుకోగా, బౌలింగ్ లో మాత్రం భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్.
Fridge Cleaning Tips: మీ ఇంట్లో ఫ్రిజ్ ఉందా..! అయితే ఇది మీకోమే
ఇకపోతే సిరీస్ లో భాగంగా జరిగిన లార్డ్స్ టెస్టులో బ్యాటుతో చివర్లో తన ప్రభావాన్ని చూపినా జట్టుకు గెలుపునివ్వలేకపోయిన సిరాజ్, ఈసారి బంతితో ఒవల్ వేదికగా సంచలనం సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన సిరాజ్, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను మట్టికరిపించాడు. ఈ టెస్ట్ మ్యాచులో మొత్తం 9 వికెట్లు తన ఖాతాలో వేసుకుని “ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్” అవార్డును అందుకున్నాడు. ముఖ్యంగా ఆఖరి రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు కావాల్సిన సమయంలో భారత్‌కు 4 వికెట్లు తీయాల్సిన పరిస్థితి. జేమీ ఓవర్టన్, జేమీ స్మిత్ క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్ బాధ్యత ప్రసిద్ధ్ కృష్ణకు అప్పగించగా, ఆ ఓవర్‌లో రెండు బౌండరీలు రావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనితో ఇంగ్లండ్ కేవలం లక్ష్యం 27 పరుగుల దూరంలో ఉండిపోయింది.
Mohammed Siraj: మనతో పెట్టుకుంటే కథ వేరుంటది.. సిరాజ్ సునామి.. ఇంగ్లండ్‌ని చుట్టేసిన స్పెల్!
అయితే ఇక్కడే మ్యాచ్ స్వరూపం మారింది. సిరాజ్ బంతిని అందుకొని తొలి ఓవర్‌లోనే స్మిత్‌ను ఔట్ చేశాడు. ఆ వెంటనే ఓవర్టన్‌ను అద్భుతంగా LBW చేసి పెవిలియన్ చేర్చాడు. ఇక ఈ దశలో ప్రసిద్ధ్ కూడా జతకలిశాడు. అతను తన పేస్‌తో టెయిలెండర్ టంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. చివరిగా, తొలి ఇన్నింగ్స్‌లో భుజానికి గాయం అయినప్పటికీ జట్టు కోసం బ్యాటింగ్‌కు దిగిన క్రిస్ వోక్స్ వచ్చాడు. ఒకవైపు చేతిలో నొప్పి, మరోవైపు మ్యాచ్‌పై ఒత్తిడి ఉన్నా.. తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ, భారత బౌలింగ్ దళం ముందు నిలువలేకపోయాడు. చివరకు ఇంగ్లండ్ 367 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో భారత్‌కు విజయం దక్కింది.