NTV Telugu Site icon

Telangana: ఈ నెల 14 నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు..

Bhatti

Bhatti

ఈ నెల 14 నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. గత పది నెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సర్కార్ ముందుకు దూసుకెళ్తుంది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి అవుతున్నందున.. ఈ నెల 14 వ తేదీ నుండి డిసెంబర్ 9వ తేదీ వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలు ఫోకస్ చేస్తూ.. ప్రభుత్వ విజన్ ప్రజలకు వివరించాలని నిర్ణయం తీసుకుంది.

Read Also: CM Nitish Kumar: నన్ను సీఎం చేసింది ఆ మహానుభావుడే.. బీహార్ సీఎం కీలక వ్యాఖ్యలు

ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని.. దాదాపు రూ. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాల మాఫీ చేయడంతో పాటు, మహిళా సంఘాలకు రూ. 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందచేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే.. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు.

Read Also: Canada Student Visa: కెనడా వెళ్లాలనుకుంటున్న ఇండియన్ స్టూడెంట్స్‌కి షాక్.. SDS వీసా నిలిపివేత..

అంతేకాకుండా.. పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదర్చడం, స్పోర్ట్ యూనివర్సిటీకి ఫౌండేషన్, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభోత్సవం, ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపనలు జరుగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలను నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం.

Show comments