Illicit Relationship: కోడి కత్తులతో విచక్షణారహితంగా దాడి.. యువకుడి దారుణ హత్య!

Murder

Murder

Illicit Relationship: వారు నలుగురు మంచి స్నేహితులు.. ఊరిలో ఎక్కడికి వెళ్లాలన్నా.. అందరూ కలిసే వెళ్లేవారు.. పార్టీలు చేసుకునే వారు.. కానీ ఆందులో ఒకరు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది ఎవరు చేశారనే దానిపై మిస్టరీ వారం రోజులపాటు కొనసాగింది. చివరికి ముగ్గురు స్నేహితులే ఒకరిని మట్టుబెట్టారని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంతకీ స్నేహితున్ని అంత దారుణంగా ఎందుకు చంపారు? దీనిపై శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Valentine’s Day Scams: పోరగాళ్లు జర జాగ్రత్త.. వాలెంటైన్స్‌ డే ప్లాన్స్‌లో ఈ 5 తప్పులు చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ!

శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద కోడిపల్లి గ్రామం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో ఫిబ్రవరి 3న ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు. హత్యకు గురయిన వ్యక్తిని లింగమయ్యగా గుర్తించారు. ఐతే వారం రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వీడింది. హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధంగా గుర్తించారు.

అసలు విషయానికి వస్తే.. చనిపోయిన వ్యక్తి లింగమయ్య, మనోజ్, నవీన్, ప్రభాస్ నలుగురు స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో లింగమయ్యకు మనోజ్‌కు వరుసకు చెల్లెలు అయ్యే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా మనోజ్‌కు తెలిసింది. దీంతో లింగమయ్యను పలుమార్లు హెచ్చరించాడు మనోజ్. కానీ లింగమయ్య పెడచెవిన పెట్టాడు. మరోవైపు గ్రామంలో ఈ విషయం గురించి చర్చించుకోవడం అవమానంగా భావించిన మనోజ్.. లింగమయ్యను తుదిముట్టించాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఈ విషయాన్ని స్నేహితులకు తెలియజేసి పక్కా ప్లాన్ రెడీ చేశాడు.

Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..

అందరూ అనుకున్న పథకం ప్రకారం.. ఫిబ్రవరి మూడో తేదీన సాయంత్రం గ్రామ శివారులో ఈ విషయమే చర్చించాలని లింగమయ్యను అక్కడికి పిలిచారు. మనోజ్‌ ఈ విషయమే చర్చిస్తూ పథకం ప్రకారం తన వద్దనున్న కోడి కత్తులతో విచక్షణారహితంగా లింగమయ్య పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లింగమయ్య అక్కడికక్కడే మరణించాడు. దీంతో అక్కడి నుంచి ముగ్గురు పారిపోయారు. ఈ విషయమై లింగమయ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి నిందితులను రొద్దం మండలం పెద్దమంతూరు వద్ద ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.