Neeraj Chopra-Visa: నీరజ్ చోప్రా ‘గోల్డ్’ కొడితే.. ప్రపంచంలో ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు!
- నీరజ్ చోప్రాపై భారీ ఆశలు
- మాక్స్ డెహ్నింగ్ నుంచి గట్టిపోటీ
- గోల్డ్ కొడితే ఫ్రీ వీసా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Visa If Neeraj Chopra Wins Gold: పారిస్ ఒలింపిక్స్ 2024లో స్టార్ జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాపై భారత అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. విశ్వ క్రీడల్లో నీరజ్ మరో స్వర్ణ పతకం గెలవడం ఖాయం అని అందరూ భావిస్తున్నారు. అయితే జర్మనీకి చెందిన 19 ఏళ్ల మాక్స్ డెహ్నింగ్ నుంచి నీరజ్‌కు గట్టి పోటీ ఎదురుకానుంది. జర్మన్ వింటర్ త్రోయింగ్ ఛాంపియన్‌షిప్‌లో మాక్స్ 90.20 మీటర్లు విసిరాడు. ఈ సంవత్సరంలో ఈ మార్కును దాటిన మొదటి జావెలిన్ త్రోవర్ కావడం విశేషం.
అయితే పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఏ దైశానికైనా వెళ్లేందుకు ఫ్రీ వీసా ఇప్పిస్తానన్నారు. ‘పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ గోల్డ్ మెడల్ సాధిస్తే ఫ్రీ వీసా ఇప్పిస్తా.. లెట్స్ గో’ అని మోహక్ ఆన్లైన్ జాబ్ సెర్చింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్లో తాజాగా పోస్ట్ చేశారు. ఆఫర్ ప్రాసెస్ ఏంటో చెప్పాలంటూ యూజర్లు అడగగా.. ప్రొసిజర్ను వివరంగా చెప్తూ మోహక్ మరో పోస్ట్ చేశారు.
Also Read
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్‌తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్‌లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్‌కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
Also Read: Hero Nani: నాకు ఇప్పుడు ఆ ఆసక్తి లేదు: నాని
‘నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధిస్తే అందరికీ ఫ్రీ వీసా ఇస్తానని జులై 30న చెప్పాను. ఆగస్టు 8న జావెలిన్ త్రో ఫైనల్ జరగనుంది. నీరజ్ గోల్డ్ మెడల్ నెగ్గితే.. యూజర్లందరికీ మా కంపెనీ తరఫున ఒక్క రోజు ఫ్రీ వీసా ఇప్పిస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా వీసా ఖర్చు మాదే. మీ ఈమెయిల్ కామెంట్ బాక్స్‌లో పెట్టండి. వీసా పొందేందుకు వీలుగా మీకు ఓ అకౌంట్ క్రియేట్ చేస్తాం’ అని మోహక్ క్లారిటీ ఇచ్చారు. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లో ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ బంగారు పతకం సాధించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
8849 Tank 5: ప్రొజెక్టర్‌తో 8849 ట్యాంక్ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల.. 17,600mAh భారీ బ్యాటరీ, 3K డిస్ప్లే
-
Billa Ranga Baasha : 2209 ప్రపంచంలో కిచ్చా సుదీప్ యాక్షన్.. ‘బిల్లా రంగ బాషా’ నుంచి బిగ్ అప్డేట్!
-
Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
-
Astrology: స్నేహానికి ఎక్కువ విలువ ఇచ్చే 4 రాశులు వీరేనా? ఫ్రెండ్ కోసం ఎంత దూరమైనా వెళ్తారట!
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!