రోడ్డు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో గోల్డెన్ అవర్ పేరుతో మోడీ ప్రభుత్వం మరో కొత్త పథకం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. దీని ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత ఉచిత చికిత్స అందించేందుకు కసరత్తు కొనసాగుతుంది. హర్యానా, చంఢీగఢ్‌లో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసేందుకు రెడీ అయింది. అనంతరం దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. ఇందు కోసం ఎంవీఏ చట్టం-2019కి సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.
Read Also: Deepika Padukone : దీపికా – రణభీర్ లు సరోగసీని ఎంచుకున్నారా? దీపికా లేటెస్ట్ లుక్ వైరల్..
ఇక, కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకం కింద 1. 5 లక్షలు రూపాయలు లేదా 7 రోజుల దవాఖానలో చికిత్సలో ఏది తక్కువ ఖర్చయితే దాన్ని ఉచితంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు కల్పించాలని నరేంద్ర మోడీ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, ప్రమాదం జరిగిన మొదటి గంట సమయాన్ని గోల్డెన్ అవర్‌గా పిలుస్తారు.. ఈ టైమ్ లోగా సరైన చికిత్స అందితే ప్రాణాలు దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది.. కనుకా, ఈ ప్రాజెక్ట్ కోసం సాధారణ బీమా కంపెనీలు 0.5 శాతం థర్డ్ పార్టీ ప్రీమియం వితరణతో సుమారు 100 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చూస్తుంది.
