Site icon NTV Telugu

VC.Sajjanar: బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ.. రేపటి నుంచి ఇవి తప్పని సరి..!

Sajjnor

Sajjnor

మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమల్లో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతి ప్రయాణికురాలు విధిగా జీరో టికెట్ ను తీసుకుని సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. మహిళలకు జీరో టికెట్ల జారీపై క్షేత్రస్థాయి అధికారులతో ఇవాళ సాయంత్రం టీఎస్ఆర్టీసీ ఎండీ వర్చువల్ గా సమావేశం నిర్వహించారు. 

Read Also: TDP MPs: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసిన టీడీపీ బృందం

కాగా, ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన మహాలక్ష్మి- మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యానికి మహిళ నుంచి మంచి స్పందన వస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ప్రశాంతంగా ఈ పథకం అమలవుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సాప్ట్ వేర్ ను సంస్థ అప్ డేట్ చేసింది. ఆ సాప్ట్ వేర్ ను టిమ్ మెషిన్లలో ఇన్ స్టాల్ చేయడం జరుగుతోంది. మెషిన్ల ద్వారా రేపటి (శుక్రవారం) నుంచి జీరో టికెట్లను సంస్థ జారీ చేస్తుంది. మహిళా ప్రయాణికులకు తమ వెంట ఆధార్, ఓటరు, తదితర గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి అని సూచించారు. స్థానికత ధృవీకరణ కోసం వాటిని కండక్టర్లకు చూపించి.. విధిగా జీరో టికెట్లను తీసుకోవాలి అని టీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి తెచ్చిన ఈ పథకాన్ని.. మహిళలు, బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు ఉపయోగించుకోవాలి అని వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

Read Also: Vijayakanth : విజయ్ కాంత్ ను చూసి కన్నీటిపర్యంతమైన పార్టీ కార్యకర్తలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

అయితే, మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీఎస్ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని సజ్జనార్ తెలిపారు. ఉచిత ప్రయాణ సౌకర్యం సమర్థవంతంగా అమలయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంస్థకు సహకరించాలని ఆయన కోరారు. అతి తక్కువ సమయంలోనే జీరో టికెట్ కోసం సాప్ట్ వేర్ ను అప్ డేట్ చేసి.. అందుబాటులో తీసుకు వచ్చిన టీఎస్ఆర్టీసీ అధికారులను ఈ సందర్భంగా సజ్జనార్ అభినందించారు. 

Exit mobile version