ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. రేపటి నుంచి ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. నాలుగు విడతల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నారు. ఆయా రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులకు అందజేయనున్నారు. మొదటి విడత లో రేపటి నుంచి 9 జిల్లాల్లో కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. విజయనగరం, విశాఖపట్నం, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రేషన్ కార్డుల జారీ చేయనున్నారు. రెండో విడత ఈ నెల 30 నుంచి 4 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు.
Also Read:Film Federation : సినీ కార్మికులందరికీ వేతనాలు పెరిగాయ్.. కానీ వాళ్లకు?
చిత్తూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ. మూడో విడత లో వచ్చే నెల 6 నుంచి 5 జిల్లాలు అనంతపురం, అల్లూరి సీతారామ రాజు, పార్వతీపురం మన్యం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అనకాపల్లి,లో పంపిణీ.. నాలుగో విడతలో వచ్చే నెల 15 నుంచి 8 జిల్లాలు బాపట్ల, పలనాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, శ్రీ సత్య సాయి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ చేయనున్నారు. గ్రామ వార్డ్ సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు. స్థానిక నేతలు.. అధికారులు పాల్గొననున్నారు.