Site icon NTV Telugu

Free Bus Tickets : గుంజీలు తీస్తే ఫ్రీ బస్‌ టికెట్‌

Bus Tickets

Bus Tickets

తమ దేశప్రజలను ఆరోగ్యవంతమైన జీవితం వైపు అడుగులు వేయించేందుకు యూరప్‌ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. చాలా మంది ఫిట్‌గా ఉండాలని రోజువారీ వ్యాయామాన్ని అనుసరించాలని కోరుకుంటారు. కొందరు.. జిమ్‌కి వెళతారు ఇంకొందరు ఇంట్లోనే వ్యాయామాలు చేస్తారు. అంతేకాకుండా.. మరికొంతమంది ఎక్కువసేపు నడవడానికి ప్రయత్నిస్తారు. కానీ కొందరు రోజువారి పని ఒత్తిడిలో తమ వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. తమ ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుతున్నట్లు భావించిన యూరప్‌ దేశం.. తమ దేశ పౌరులు ఆరోగ్యవంతులు ఉండేందుకు ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Also Read : SI Prelims Events : వావ్‌.. ఎస్సై సెలక్షన్‌లో తల్లి కూతుళ్ళు
ఈ నేపథ్యంలోనే.. యూరప్‌లోని రొమానియాలో అక్కడి ప్రభుత్వం ప్రజలకు బంపర్‌ ఆఫర్‌ ఇస్తోంది. స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌ అనే ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా అద్భుతమైన ఆఫర్‌ని ప్రజలకు ఇస్తోంది అక్కడి సర్కార్‌. అక్కడ 20 గుంజీలు తీస్తే ఫ్రీగా బస్సులో తిరిగేయవచ్చు. ఈ ఉచిత టిక్కెట్‌ను అక్కడి ప్రజలు హెల్త్‌ టిక్కెట్‌గా పిలుస్తారు. ఈ క్రమంలో ఓ యువతి ఒక మిషన్‌ బూత్‌ ముందు నిలబడి 20 గంజీలు తీస్తుంది. అయిపోగానే టిక్కెట్‌ మిషన్‌ నుంచి బయటకు వచ్చినట్లు కనిపిస్తోంది. సంబంధింత వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

Exit mobile version