NTV Telugu Site icon

Fraud in Bank: ఐసీఐసీఐ బ్యాంక్‌లో కోట్ల రూపాయల స్కామ్.. పెరుగుతున్న బాధితుల సంఖ్య

Icici

Icici

Fraud in Bank: పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగిన కోట్ల రూపాయల స్కాం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 60 మందికి పైగా ఖాతాదారులు ఆధారాలతో సహా బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని బ్యాంక్ అధికారుల వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కాం విషయం తెలుసుకున్న బ్యాంకు సీనియర్ అధికారులు ముంబై నుంచి చిలకలూరిపేట వచ్చి పరిస్థితి సమీక్షించారు. పోలీసు ఉన్నత అధికారులకు జరిగిన సమాచారం అందించారు. చిలకలూరిపేటలో జరిగిన బ్యాంక్ కోట్ల రూపాయల్లో ఉండటంతో ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించవచ్చని భావిస్తున్నారు పోలీస్ అధికారులు.

Read Also: Cyber ​​Criminals: 18 మంది, 319 కేసులు.. సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్..

మరి కొంతమంది ఖాతాదారులు దూరప్రాంతాల్లో ఉండటంతో , బ్యాంకు స్కాం సమాచారం తెలుసుకొని, మరికొంతమంది బాధితులు, ఈరోజు లేదా రేపటికి చిలకలూరిపేటకు చేరుకునే అవకాశం ఉంది. రేపు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన లెక్కలు ప్రకారం, పాతిక కోట్లకు పైగా తమ సొమ్ము పోగొట్టుకున్నట్లుగా ఖాతాదారులు ఆధారాలు చూపించారు. మొత్తం బాధితులు సంఖ్య తేలితే, భారీగా జరిగిన స్కాం వ్యవహారం తేల్చేందుకు ప్రత్యేక దర్యాప్తు జరిపించే అవకాశం ఉంది.

 

Show comments