హైదరాబాద్ పోలీసులు మరో సాహసం చేశారు. ముప్పు తిప్పలు పెడుతూ రూ.కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్న 18 మంది సైబర్ నేరగాళ్ల ముఠాను అదుపులో తీసుకున్నారు. తెలంగాణలో నిందితులపై 45 కేసులు ఉన్నట్లు గుర్తించారు. వీరిపై దేశవ్యాప్తంగా 319 కేసులు ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ఐదు లక్షల నగదు, 26 మొబైల్ ఫోన్స్, 16 ఏటీఎం కార్డులు, పాస్ బుక్స్ ఇతర ఎలక్ట్రానిక్ డివైసులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక ,మహారాష్ట్ర ,రాజస్థాన్ లో కీలక ఆపరేషన్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్వహించారు. నేరగాళ్ల కోసం ఆరు ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ నుంచి ఏడు కోట్లకి పైగా డబ్బులను కొట్టేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. నిందితుల బ్యాంకు ఖాతాలోని 1.61 కోట్ల రూపాయల నగదును పోలీసులు ఫ్రిజ్ చేశారు. తెలంగాణలో నమోదైన కేసుల్లో బాధితుల నుంచి 6.94 కోట్ల రూపాయలు నేరగాళ్లు కాజేసినట్లు వెలుగుచూసింది.
దేశ వ్యాప్తంగా సెక్స్ స్టార్షన్, కొరియర్, పెట్టుబడి పేరుతో మోసాలు, ఓటిపి, ఇన్సూరెన్స్ పేర్లతో సైబర్ నేరాలకు నిందితులు పాల్పడ్డారు. దీంతో బాధితులు భయంతో వీరికి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసి మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. బాధితులు ఫిర్యాదుల మేరకు సైబర్ నేరగాళ్లపై నిఘా ఉంచిన హైదరాబాద్ పోలీసులు వీరిని మాటు వేసి పట్టుకున్నారు. వీరిపై సుమారు 435 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెలుగులోకి రావడంతో పాత నేరగాళ్లే ముఠాగా ఏర్పడి సొమ్మును కాజేస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కి రెస్పాండ్ కావద్దని సూచించారు. సైబర్ అరెస్టు చెప్పే వారి మాటలను ఎట్టి పరిస్థితిలో నమ్మవద్దని తెలిపారు. గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్స్ వచ్చి పోలీసులమని చెప్పిన వాటిని రెస్పాండ్ కావద్దని తెలిపారు. ఇటువంటి ఫోన్ కాల్స్ ను కట్ చేయాలని సూచించారు. పదే పదే అలాంటి కాల్స్ వచ్చిన వెంటనే పోలీసులకు సంప్రదించాలని కోరారు.
Lemon: నిమ్మకాయలు ఎండిపోయాయని బటయపడేస్తున్నారా?