NTV Telugu Site icon

Hospital Fraud: వైద్యం కోసం వెళ్తే.. వివరాలు సేకరించి లోన్ తీసుకున్న కేటుగాళ్లు

Amor Hospital

Amor Hospital

Hospital Fraud: కూకట్‌పల్లిలోని అమోర్ హాస్పిటల్‌లో వైద్యం కోసం వచ్చిన పేషెంట్లను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 2022లో వైద్యం నిమిత్తం హాస్పిటల్‌ను ఆశ్రయించిన ఓ బాధితురాలి పేరుపై రహస్యంగా ప్రైవేట్ లోన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ మోసపూరిత చర్యలకు పాల్పడిన హాస్పిటల్ యాజమాన్యం, థర్డ్ పార్టీ బ్యాంకుల ద్వారా లోన్లు తీసుకుని బాధితులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read Also: Irregular Menstrual Cycle: మహిళలకి ఎందుకు ఋతు చక్రం సమస్యలు వస్తాయంటే?

ఈ విషయమై బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మీకు ఇన్సూరెన్స్ రెడీ చేస్తున్నామని హాస్పిటల్ సిబ్బంది చెప్పి, వారికి తెలియకుండానే బాధితురాలి బావ పేరుపై లోన్ తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత బాధితులు హాస్పిటల్ యాజమాన్యాన్ని సంప్రదించగా.. వారు సమస్యను పరిష్కరించడానికి బదులు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు, ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోండి అంటూ బాధితులను హాస్పిటల్ నుంచి బయటకు నెట్టివేశారు. ఈ ఘటన బాధితులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.

Betting App Promotions: చిక్కుల్లో మరో హీరోయిన్?

ఈ మోసంలో భాగంగా బాధితుల పేరుపై రూ. 1,14,539 బ్యాంక్ లోన్ ఉన్నట్లు వెల్లడైంది. థర్డ్ పార్టీ బ్యాంక్ సిబ్బంది బాధితులకు ఫోన్ చేసి, మీరు లోన్ కట్టాల్సిందే, లేకపోతే సిబిల్ స్కోర్‌లో సమస్యలు వస్తాయి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాట్లు బాధితులు తెలిపారు. ఈ బెదిరింపులు బాధిత కుటుంబాన్ని మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ దుర్మార్గపు చర్యలకు వ్యతిరేకంగా బాధితులు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అమోర్ హాస్పిటల్ యాజమాన్యం చేసిన మోసంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.