Site icon NTV Telugu

Physical Harassment: ఏపీలో మరో ఘటన.. వాష్‌ రూమ్‌లో విద్యార్థినికి వేధింపులు..! లెక్చరర్‌పై ఫోక్సో కేసు..

Physical Harassment

Physical Harassment

Physical Harassment: ఆంధ్రప్రదేశ్‌లో చిన్నారులు, విద్యార్థినిలపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లు, లెక్చరర్లు.. కామాంధులుగా మారిపోయి.. విద్యార్థినిపట్ల వికృతంగా ప్రవర్తిస్తున్నారు.. అలాంటి ఓ లెక్చర్‌పై తాజాగా కేసు నమోదు చేశారు పోలీసులు.. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల జూనియర్‌ కాలేజీలో చోటు చేసుకున్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించని పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అడ్డతీగల జూనియర్ కళాశాలకు చెందిన రామకృష్ణ అనే అధ్యాపకుడిపై ఫోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.. ఓ విద్యార్థిని వెంటపడుతూ లైంగిక వేధింపులకు గురిచేసినట్టు రామకృష్ణపై అభియోగాలు మోపారు.. వాష్ రూమ్ కి విద్యార్థిని వెళ్తుండగా వెంటపడిన రామకృష్ణ.. ఆమె శరీరంపై చేతులు వేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు.. అడ్డుచెప్పిన విద్యార్థిని మెడను గట్టిగా నొక్కి ఇబ్బంది పెట్టాడు.. భయాందోళనకు గురైన విద్యార్థిని.. అధ్యాపకుడిని ప్రాధేయపడింది.. ఎంత చెప్పినా వినకపోవడంతో.. అతని బారినుంచి తప్పించుకున్న ఆమె.. హాస్టల్ కు పరుగులు తీసింది.. అయితే, ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తమ కూతురు మానసికంగా కృంగి పోయి ఉండడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు.. దీంతో.. కాలేజీలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది..

Read Also: Gautam Gambhir Farewell Note: నేను ప్రతిరోజు ఓడిపోతాను కానీ.. గౌతమ్‌ గంభీర్‌ ఎమోషనల్ వీడియో!

ఇక, తోటి విద్యార్థినిలు తమ సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది.. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అడ్డతీగల పోలీసులు.. అధ్యాపకుడు రామకృష్ణపై కేసు నమోదు చేశారు.. ఈ ఘటనలో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. రామకృష్ణపై ఫోక్సో కేసు పెట్టారు.. మరోవైపు.. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన రామకృష్ణపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.. వేధింపులకు ఒక విద్యార్థిని బయటపెట్టింది.. రామకృష్ణ వేధింపులపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని.. విద్యార్థుల్లో మనో ధైర్యాన్ని నింపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Exit mobile version