US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!

Us Flight

Us Flight

US aircraft crash:ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న వేళ మధ్యప్రాచ్యంలో అమెరికా సైన్యానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇరాక్‌లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక ఇంధనం నింపే విమానం (KC-135 Tanker) కుప్పకూలినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. పశ్చిమ ఇరాక్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సైన్యం వెల్లడించింది.

Brown Rice Dosa: తెల్ల బియ్యం దోశలకు గుడ్‌బై.. హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇంట్లోనే క్రిస్పీ, టేస్టీగా బ్రౌన్ రైస్ దోశ ట్రై చేయండి..

అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్‌కు వ్యతిరేకంగా చేపట్టిన సైనిక చర్యల్లో భాగంగా రెండు KC-135 ఇంధన ట్యాంకర్ విమానాలు గాలిలోకి ఎగిరాయి. ఇందులో ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. రెండవ విమానం సాంకేతిక కారణాల వల్ల పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలిపోయింది. అయితే, ఈ విమానం శత్రువుల కాల్పుల వల్ల కూలిపోలేదని సైన్యం స్పష్టం చేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Monalisa- Farman Khan: మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ బ్యాక్‌ గ్రౌండ్ ఇదే..

ఇరాన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుండి అమెరికాకు చెందిన విమానాలు ప్రమాదానికి గురవ్వడం ఇది నాలుగోసారి. గత వారమే ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. కువైట్ సైన్యం పొరపాటున జరిపిన కాల్పుల్లో అమెరికాకు చెందిన మూడు యుద్ధ విమానాలు కూలిపోయాయి.