NTV Telugu Site icon

Pawan Kalyan: రాళ్లతో పవన్‌పై దాడికి యత్నం.. నలుగురిని పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది..!

Pawan Kalyan

Pawan Kalyan

Pawan Kalyan: వారాహి యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. నిన్న రోడ్డు షోలో రాజోలులో నాపై దాడికి యత్నించారని తెలిపారు.. రాళ్లు పట్టుకుని దాడి చేయడానికి నలుగురు యువకులు ప్రయత్నించారన్న ఆయన.. వీరిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు.. ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటాయేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, ప్రజల్లో మార్పు వస్తుందనుకుని అధికారంలో ఉన్నవాళ్లు ఉలిక్కిపడతారు.. మనల్ని నాశనం చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.. సుపారీ గ్యాంగ్ లు తిరుగుతున్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Read Also: Vijay Sethupathi:ఇన్‌స్టాగ్రామ్ లో విజయ్ సేతుపతి ఫాలో అవుతున్న ఏడుగురు ఎవరంటే?

ఇక, రాజోలు ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేనాని.. చీకట్లో ఉన్న జనసేన పార్టీని.. 2019 ఎన్నికల్లో రాజోలులో గెలిపించి చిరు దీపం వెలుగించారని అన్నారు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. రాజోలు ఎమ్మెల్యే మనతో ఉండి ఉంటే.. భుజాలపై పెట్టుకునేవాడనని అన్నారు. ఎమ్మెల్యే పార్టీ మారి.. ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.. ఉభయగోదావరి జిల్లాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టానని.. రాజోలు, పి గన్నవరం నియోజకవర్గాలు నా పర్యవేక్షణలోనే ఉంటాయన్న ఆయన.. గోదావరి జిల్లాలు బాగుంటేనే రాష్ట్రమంతా బాగుంటుంది.. వారాహి యాత్రను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించానని చెప్పారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.