NTV Telugu Site icon

4 Tiger Bodies Found : లభ్యమైన 4 పులి పిల్లల కళేబరాలు.. అసలేం జరిగింది..?

Tigers

Tigers

మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ (టీఏటీఆర్)లో నాలుగు పులి పిల్లల మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. పులుల కళేబరాలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు. పులే చంపి ఉంటుందని అనుమానిస్తున్నారు. అయితే.. ఈ మేరకు అటవీ శాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. కేవలం వారం రోజు వ్యవధిలో మొత్తం ఆరు పులులు చనిపోవడంతో కలకలం రేపుతుంది. మొన్న ఈమధ్య రెండు పులుల కళేబరాలను గుర్తించారు అటవీశాఖ అధికారులు. జిల్లా కేంద్రానికి 47 కిలోమీటర్ల దూరంలో ఉన్న తడోబా అంధారి టైగర్ రిజర్వ్ బఫర్ జోన్‌లోని మొహర్లీ పరిధిలోని కంపార్ట్‌మెంట్ 189లో గురువారం ఉదయం ఓ పులి చనిపోయిందని చీఫ్ అటవీ సంరక్షణాధికారి డాక్టర్ జితేంద్ర రామ్‌గావ్కర్ తెలిపారు.
Also Read : Uttarpradesh: 14 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య.. ఇద్దరు అరెస్ట్

పులిపై మరో పులి దాడి చేసినట్లు గుర్తులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. దాదాపు 6 నుంచి 7 నెలల వయసు గల పులి పోరాటంలో చనిపోయి ఉండొచ్చన్నారు. పులి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ట్రాన్సిట్ ట్రీట్‌మెంట్ సెంటర్‌కు తరలించామన్నారు. అయితే నేడు తాజాగా లభ్యమైన నాలుగు పులి పిల్లల కళేబరాలను శవపరీక్ష కోసం తరలించారు అధికారులు.
Also Read : Double Decker Buses : గుడ్ న్యూస్.. త్వరలో రోడ్డెక్కనున్న డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు