Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Formula E Case: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. ఏసీబీ కోర్టులో నేడు విచారణ ప్రారంభం కానుంది. ఈ వ్యవహారంలో గత మార్చి 23న ఏసీబీ అధికారులు కోర్టులో 77 పేజీలతో కూడిన సమగ్ర చార్జిషీట్‌ను దాఖలు చేయగా, 14 మంది సాక్షుల వాంగ్మూలాలను అందులో పేర్కొన్నారు. ఈ చార్జిషీట్‌ను పరిశీలించిన ఏసీబీ కోర్టు మే 14న విచారణకు ఆమోదం తెలపడమే కాకుండా, ఈ రోజు (జులై 31) విచారణకు నేరుగా హాజరు కావాలంటూ నిందితులకు సమన్లు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నేడు జరిగే విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డి, స్పోర్ట్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ రావులు హాజరు కానున్నారు. ఈ కేసులో యూకేకు చెందిన ఎఫ్ఈఓ సంస్థ ప్రతినిధి అల్బెర్టోకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది.
ఈ వ్యవహారంలో ఆర్థిక, న్యాయ శాఖల అనుమతులు కానీ, క్యాబినెట్ ఆమోదం కానీ లేకుండానే ఫార్ములా-ఈ రేస్ సీజన్ 10 నిర్వహణ కోసం నిధులను విడుదల చేసి దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. నిబంధనలను తుంగలో తొక్కి చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల హెచ్ఎండీఏకు నేరుగా సుమారు రూ.78 కోట్ల నష్టం వాటిల్లడమే కాకుండా, ప్రభుత్వంపై అదనంగా దాదాపు రూ.600 కోట్ల మేర భారం పడిందని చార్జిషీట్లో స్పష్టం చేశారు. అంతేకాకుండా, ‘ఎస్ నెక్స్ట్ జెన్’ సంస్థకు అనుచిత లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా ‘గ్రీన్ కో’ సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లు వచ్చాయని, ఇది స్పష్టమైన క్విడ్ ప్రో కో అని ఏసీబీ తన నివేదికలో మోపిన ప్రధాన అభియోగం. చార్జిషీట్ దాఖలైన తర్వాత జరుగుతున్న మొదటి విచారణ కావడంతో నిందితులందరూ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. ఈ రోజు విచారణ సందర్భంగా ఏసీబీ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనేది రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Also Read
- Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
- High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
- AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్‌తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
తాజావార్తలు
-
Mahindra Thar 2026: ఆఫ్‌రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్‌తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Daayra: స్టార్ కాస్ట్ ఉన్నంత మాత్రాన సినిమా హిట్ కాదు.. అమితాబ్-రేఖలను ఉదాహరణగా చూపించిన పృథ్వీరాజ్
-
High Court: జూబ్లీహిల్స్ మాజీ సీఐ శ్రీనివాస్‌రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
-
AP Collectors Conference: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కొత్త టార్గెట్.. గంట ప్రిపరేషన్ కాదు, 2 నిమిషాల్లో క్లియర్ రిపోర్ట్!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!