Sheikh Mohammed Mustafa: గుజరాత్లో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లాలో సంచలనం సృష్టించిన నూజివీడు కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే షేక్ మహ్మద్ ముస్తఫాను గుజరాత్‌లోని వడోదరలో అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యేను ప్రత్యేక పోలీసు వాహనంలో గుజరాత్ నుంచి నూజివీడుకు తరలిస్తున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. గత నెల 27న జరిగిన కిడ్నాప్ ఘటనపై ప్రత్యేక బృందాలు విస్తృతంగా దర్యాప్తు చేపట్టాయి. పొగాకు వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన వివాదమే ఈ కిడ్నాప్‌కు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే ముస్తఫా మేనల్లుడు షేక్ షహబాజ్ అలీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అంతకుముందే మైసూరుకు చెందిన ఉపేద్ హమీద్, గుంటూరు జిల్లాకు చెందిన కొండపల్లి వెంకట సంతోష్, ఈదర శశికుమార్, షేక్ భినైతుల్లా, నల్ల మేకల శాంతి స్వరూప్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు సిమ్ కార్డులు, వాహనాలు సమకూర్చడంతో పాటు పరారికి సహకరించిన వారిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read
- Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
- Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
- Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు గుంటూరులో పొగాకు గోదాం ఉంది. ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన కడిమి సూర్యచంద్రం రైతుల నుంచి పొగాకు సేకరించి.. గుంటూరులో ముస్తఫాకు అమ్మేవారు. పొగాకు ధరలను ముస్తఫా భారీగా తగ్గించడంతో.. గుంటూరులోనే మరో కంపెనీకి సూర్యచంద్రం విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పొగాకు బేళ్లను వాహనంలో తీసుకెళ్తున్న సూర్యచంద్రం కుమారుడు అభి సహా మరికొందరిని ముస్తఫా కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు. విషయం తెలుసుకున్న సూర్యచంద్రం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కిడ్నాపర్ల ముఠా బాధితులతో పెదకాకాని ఠాణాలో లొంగిపోయింది. ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్ అప్పటి నుంచి పరారీలో ఉన్నారు. ఈరోజు గుజరాత్లో ముస్తఫాను అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
-
22 US Soldiers Killed in Iran War?: ఇరాన్ యుద్ధంలో అమెరికా సైనికుల మరణాలపై సంచలన నివేదిక.. 22 మంది మృతి?
-
Donald Trump: భారత్, చైనాకు బిగ్ షాక్.. నూతన చట్టంపై సంతకం చేసి డోనాల్డ్ ట్రంప్..
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..