NTV Telugu Site icon

Former VRA : కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాజీ వీఆర్ఏలు

Cm Kcr

Cm Kcr

వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. వీఆర్‌ఏ వ్యవస్థను రద్దు చేస్తూ.. వీఆర్‌ఏలను పర్మినెంట్‌ ప్రభుత్వ ఉద్యోగులగా క్రమబద్దీకరించనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్‌. ఈ నేపథ్యంలో.. సచివాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు వీఆర్‌ఏలు. అంబేద్కర్ విగ్రహానికి నివాళ్ళు అర్పించిన వీఆర్ఏలు.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించినందుకు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వీఆర్ఏలు. 61 ఏళ్ల లోపు ఉన్న 16,758 వీఆర్‌ఏలను వాళ్ల విద్యార్హతల ఆధారంగా మూడు కేటగిరిలుగా విభజించారు.

Also Read : Iris Ibrahim: ఆమెకి 83, అతనికి 37.. పెళ్లైన రెండేళ్ల తర్వాత షాకింగ్ ట్విస్ట్

19000 – 58850 పే స్కెలుతో 10 వ తరగతి వరకు లాస్ట్ గ్రేడ్ సర్వీస్ లో 10317 మందిని 22240 – 67300 పే స్కేలుతో ఇంటర్ చదివిన వాళ్లను రికార్డు అసిస్టెంట్లుగా 2761 మందిని 24280 – 72850 పే స్కెళుతో డిగ్రీ ఆపైన చదివిన వాళ్లను జూనియర్ అసిస్టెంట్లుగా 3680 మందిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నారు. ఇక 2011 అక్టోబర్ 1 లో నియమించిన వీఆర్‌ఏల పదవీ విరమణ కోసం గరిష్ట వాయో పరిమితిని నిర్ణయించలేదు. అలా ఒకవేళ 61 ఏళ్ల పైబడి ఇంకా వీఆర్‌ఏలుగా కొనసాగుతున్న 3797 మంది వారసులను వాళ్ల వాళ్ల విద్యార్హతల ఆధారంగా కంపాషనేట్ గ్రౌండ్స్ పై లాస్ట్ గ్రేడ్ సర్వీస్, రికార్డు అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టంట్ల కేటగిరీల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Also Read : Boat Accident: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. పడవ మునిగి 15 మంది మృతి