NTV Telugu Site icon

Venkaiah Naidu: ప్రజల ఆలోచనతో విప్లవం రావాలి.. బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్‌లో మార్చేయాలి..

Venkaiah Naidu

Venkaiah Naidu

Venkaiah Naidu: తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలని పిలుపునిచ్చారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. గుంటూరులోని రెవెన్యూ కళ్యాణ మండపంలో తెలుగు జర్నలిస్ట్ లకు ఉగాది పురస్కారం కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. ప్రజా సభల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి, పత్రికా రంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి, ఈ ధోరణి దేశ గౌరవానికి ముప్పు అని హెచ్చరించారు.

Read Also: Top Headlines @ 1 PM: టాప్‌ న్యూస్‌

ఇక, విద్యా, వైద్య రంగాలు వ్యాపారం అయిపోయాయి.. అనవసర పరీక్షలతో వైద్యం రాద్ధాంతం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు వెంకయ్యనాయుడు.. రాజకీయాల్లో ఉండే శక్తులు విద్య ,వైద్య రంగాలలో ప్రవేశిస్తున్నారు.. రాజకీయ రంగంలో వ్యాఖ్యలు జుగుప్త్సా కరంగా తయారయ్యాయన్నారు.. అయితే, బూతులు మాట్లాడే వ్యక్తుల చరిత్ర పోలింగ్ బూత్ లో మార్చేయాలని పిలుపునిచ్చారు.. తుపాకీ గుండు వల్ల విప్లవం రాదు.. ప్రజల ఆలోచనతో విప్లవం రావాలన్న ఆయన.. దేవస్థానంలో ప్రమాణాలు చేసే రాజకీయాలు పెరిగిపోయాయి.. ఎప్పుడు ఏ జెండా పట్టుకుంటాడు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. సిద్ధాంతం నచ్చక పోతే పార్టీ మారొచ్చు.. కానీ, పదవి కోసం పార్టీలు మారుతున్నారంటూ వ్యాఖ్యానించారు భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

Read Also: Balineni Srinivasa Reddy: బాలినేని రాజీనామాపై వైసీపీలో ఉత్కంఠ.. నేడు సీఎం జగన్‌తో భేటీ..

మరోవైపు.. ఈ రోజు ఉదయం విజయవాడలోని SSS పాక హోటల్ లో ఇడ్లీని తిన్నారు వెంకయ్యనాయుడు.. ఆ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఈ రోజు ఉదయం విజయవాడ లోని SSS పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించాను. నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి. గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి అభినందనలు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలని సూచించారు.

Show comments