Site icon NTV Telugu

Joe Biden: అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రోస్టేట్ క్యాన్సర్..

Joe Biden

Joe Biden

అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందని, ఆ క్యాన్సర్ కణాలు ఇప్పుడు అతని ఎముకలకు వ్యాపించాయని వైద్యులు నిర్ధారించారు. దీనికి సంబంధించి ఆయన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 82 ఏళ్ల బైడెన్ మూత్ర విసర్జన లక్షణాల గురించి పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ విషయం బయటపడింది. వైద్యులు బైడెన్ కు ఏయే చికిత్సలు అందించాలో పరిశీలిస్తున్నారు. ప్రోస్టేట్ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్‌గా కనిపిస్తుంది. ఈ కారణంగా చికిత్స చేయడం సాధ్యపడుతుంది. హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, కొన్ని సందర్భాల్లో ఎముకలను లక్ష్యంగా చేసుకుని చికిత్స చేయడం ప్రభావవంతంగా ఉంటుంది.

Also Read:Pakistan: పాక్ ఆర్మీ, లష్కరే ఉగ్రవాదుల కొత్త కుట్ర.. పీఓకేలో టన్నెల్స్ నిర్మాణం..

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా బైడెన్ అనారోగ్యం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘జో బైడెన్ ఇటీవలి వైద్య పరిస్థితి గురించి విని మెలానియా, నేను బాధపడ్డాము’ అని ఆయన అన్నారు. జిల్ (ట్రంప్ భార్య), కుటుంబ సభ్యులకు మా శుభాకాంక్షలు. బైడెన్ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము అని రాసుకొచ్చారు.

Also Read:Rain Alert: రేపు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన..

జో బైడెన్ 2021 నుంచి 2025 వరకు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చలో విఫలమైన తర్వాత గత ఏడాది జూలైలో తన పునఃఎన్నికల ప్రయత్నం నుంచి అకస్మాత్తుగా వైదొలిగారు. ఈ సంఘటన తర్వాత, డెమోక్రటిక్ పార్టీలో ఆందోళనలు వ్యాపించాయి. పార్టీ కొత్త అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను ఎంపిక చేశారు. కానీ 2024 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆమె ట్రంప్ చేతిలో ఓడిపోయారు. బైడెన్ క్యాన్సర్ వార్త అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ వార్త ఆయన ప్రజా జీవితాన్ని పూర్తిగా నిలిపివేస్తుందని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.

Exit mobile version