Site icon NTV Telugu

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కు రంగం సిద్ధం..?

Trump

Trump

ఒక పోర్న్ స్టార్ కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్ కు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. అయితే తన అరెస్ట్ గురించి, అది ఎప్పుడు జరుగుతుందని డొనాల్డ్ ట్రంపే స్వయంగా ప్రకటించాడు. ఈ మంగళవారం తాను అరెస్ట్ అవుతానని ఆయన వెల్లడించాడు. ఈ అరెస్ట్ కు సంబంధించి మాన్ హట్టన్ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి స్పష్టమైన సంకేతాలు అందినట్లు ట్రంప్ తెలిపారు.

Also Read : PM Narendra Modi: భారత ప్రజాస్వామ్య విజయం కొందరిని బాధపెడుతోంది.. రాహుల్ గాంధీకి కౌంటర్..

2016 ఎన్నికలకు ముందు ఒక పోర్న్ స్టార్ కు భారీగా నగదు ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడన్న ఆరోపణలపై ఇప్పటికే దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతుంది. ఈ విషయంలోనే ఆయన అరెస్ట్ కానున్నారు. అయితే ట్రంప్ అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. తనతో ఉన్న సంబంధాన్ని బహిరంగపర్చకుండా ఉండేందుకు పోర్న్ స్టార్ తో ఒప్పందం చేసుకున్నారట.. ఇందుకు గాను ఆమెకు 1.30 లక్షల అమెరికా డాలర్లు ట్రంప్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.

Also Read : Natu Natu Song: ’నాటు నాటు‘ సాంగ్ పై హర్ష గోయెంకా ఆసక్తికర ట్వీట్

అయితే ఈ సంబంధం గురించి సదరు పోర్న్ స్టారే కోర్టుకెక్కడం గమనార్హం. ట్రంప్ తో తనకు శారీరక సంబంధం ఉందని, తమ మధ్య జరిగిన నాన్ డిస్ క్లోజర్ ఒప్పందాన్ని రద్దు చేయాలంటూ లాస్ ఏంజెల్స్ లోని కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ కేసులో ట్రంప్ మీద కేసు మోపాలా లేదా అని ప్రాసిక్యూటర్లు ఆలోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కానీ ఈలోపే ఆయన అరెస్ట్ కు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే నేరారోపణలు ఎదుర్కొన్న మొదటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలోకి ఎక్కుతాడు.

Exit mobile version