Pakistan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్థాన్‌లో మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ర్యాలీలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. పాక్‌లో పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో ఈ ఫైరింగ్ జరిగింది. గురువారం వజీరాబాద్‌లో ‘నిజమైన స్వాతంత్య్రం’ ర్యాలీ సందర్భంగా జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్‌ఖాన్ కాలికి గాయమైంది. వజీరాబాద్‌లోని జఫరాలీ ఖాన్ చౌక్ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చారు. ఆయన ప్రస్తుత క్షేమంగానే ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇమ్రాన్‌తో పాటు నలుగురికి గాయాలైనట్లు సమాచారం.
Palm Oil : ఆయిల్ పామ్ సాగు కోసం అవగాహన సదస్సు.. పోడుభూముల లొల్లి..
Also Read
- Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
ఈ కాల్పుల ఘటనలో ఆయన మేనేజర్ రషీద్, సింధ్ మాజీ గవర్నర్ ఇమ్మాన్ ఇస్మాయిల్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపిన వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేశారు. పీటీఐకి చెందిన నేత ఫరూఖ్ అబీబ్ ఈ ఘటనలో ఇమ్రాన్ ఖాన్‌కు కూడా గాయాలైనట్టు ట్విటర్ వేదికగా తెలిపారు.ఈ కాల్పుల ఘటనపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు. షెహబాజ్ షరీఫ్ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వజీరాబాద్‌లో జరిగిన కాల్పుల ఘటనపై పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి స్పందించారు. దీనిపై క్షుణ్నంగా దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని త్వరలోనే శిక్షించి.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు.
https://www.youtube.com/watch?v=z6GR3BRL46Y
తాజావార్తలు
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!