Shahid Afridi: చాలాసార్లు చెప్పాను.. బౌలింగ్ ఎక్కడ చేయాలో తెలియదు.. అల్లుడు షాహీన్‌పై షాహిద్ అఫ్రిదీ ఆగ్రహం
- అల్లుడు షాహీన్‌పై షాహిద్ అఫ్రిదీ ఆగ్రహం
- షాహీన్ ఇంత కాలంగా ఆడుతున్నాడు, కానీ అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియదు
- చివరి ఓవర్లలో ఏ లైన్, లెంగ్త్ ఉపయోగించాలో కూడా అర్థం చేసుకోలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ తన అల్లుడు, స్టార్ పేసర్ షాహీన్ షాహ్ అఫ్రిదీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ20 వరల్డ్ కప్ 2026లో పాకిస్తాన్ టీమ్ నిరాశపరిచిన ప్రదర్శన, ముఖ్యంగా షాహీన్ బౌలింగ్‌లో పేలవమైన ప్రదర్శణ కారణంగా షాహిద్ అఫ్రిదీ ఈ విధంగా భావోద్వేగంతో మాట్లాడారు. టీవీ షోలో మాట్లాడుతూ, షాహిద్ అఫ్రిదీ షాహీన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “షాహీన్ ఇంత కాలంగా ఆడుతున్నాడు, కానీ అతనికి ఎక్కడ బౌలింగ్ చేయాలో తెలియదు. చివరి ఓవర్లలో ఏ లైన్, లెంగ్త్ ఉపయోగించాలో కూడా అర్థం చేసుకోలేదు. నేను అతనికి చాలాసార్లు చెప్పాను, కానీ అతను మళ్లీ మళ్లీ అదే తప్పులు చేస్తున్నాడు,” అని అఫ్రిదీ అన్నారు.
Also Read:Ai+ Pulse 2: 6000mAh బ్యాటరీతో Ai+ పల్స్ 2 రిలీజ్.. ప్రీమియం రేంజ్ ఫీచర్స్, ధర మాత్రం చాలా చౌక
Also Read
- Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
- Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
- Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
- Karnataka MLC Election Results: కర్ణాటకలో కాంగ్రెస్‌కు బీజేపీ పంచ్.. క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ-జేడీఎస్ కూటమి.!
పాకిస్తాన్ సూపర్ ఎయిట్స్ దశలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షాహీన్ బౌలింగ్ ఎంపికలు, ఫీల్డ్ సెట్టింగ్స్‌పై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. “రైట్ హ్యాండర్ బ్యాట్స్‌మన్ ఆడుతుంటే రౌండ్ ది వికెట్ బౌలింగ్ చేయకూడదు. అలా చేస్తే ఇన్సైడ్ వికెట్‌కు టార్గెట్ చేయాలి. థర్డ్ మ్యాన్, పాయింట్ ఫీల్డర్లు అప్‌లో ఉంటే ఆఫ్ స్టంప్ బయట బౌలింగ్ చేస్తే ఆసియా పిచ్‌లపై సులభంగా లాబ్ షాట్లు వస్తాయి,” అని వివరించారు. టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ క్విట్ అయిన తర్వాత షాహిద్ అఫ్రిదీ ఈ విధంగా ఆగ్రహంతో మాట్లాడటం గమనార్హం. ఇది షాహీన్ బౌలింగ్‌లో పదేపదే వచ్చిన వైఫల్యాలపై ఆయన అసంతృప్తిని సూచిస్తుంది.
Also Read:CM Revanth Reddy: రాహుల్‌ని ప్రధానిని చేయడమే లక్ష్యం.. ఆయన దేశం కోసం పీఎం కావాలి..
గతంలో కూడా భారత్‌తో జరిగిన మ్యాచ్ ఓటమి తర్వాత షాహీన్‌తో పాటు బాబర్ అజామ్, షదాబ్ ఖాన్‌లను డ్రాప్ చేయాలని అఫ్రిదీ సూచించారు. అయితే, గతంలో ఒకసారి షాహీన్‌ను తన XI నుంచి డ్రాప్ చేసి, అతని ఈగోను దెబ్బతీసి గుస్సా పుట్టించాలని ఉద్దేశపూర్వకంగా చేశానని షాహిద్ అఫ్రిదీ చెప్పారు. అది పనిచేసి షాహీన్ మంచి ప్రదర్శన చూపించాడని కూడా పేర్కొన్నారు. కానీ ఈసారి వరల్డ్ కప్ ఎగ్జిట్ తర్వాత మాత్రం ఆయన ఆగ్రహం మరింత తీవ్రంగా ఉంది. పాకిస్తాన్ క్రికెట్లో సీనియర్ ఆటగాళ్ల నిలకడలేని ఆటతీరు, టీమ్ ఓటములు కొనసాగుతున్న నేపథ్యంలో షాహిద్ అఫ్రిదీ వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.
తాజావార్తలు
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Neeraj Yadav: క్రీడా లోకంలో విషాదం.. స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ ఆత్మహత్య..!
-
Train Passengers Alert: రైలు ప్రయాణికులకు అలర్ట్.. 6 గంటల పాటు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు బంద్!
-
Congress Protest: రైల్వే నిలయం వద్ద ఉద్రిక్తత.. ఢిల్లీలో కాంగ్రెస్ ర్యాలీకి ప్రత్యేక రైళ్లు కేటాయించాలని పార్టీ నేతల ధర్నా..
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!