NTV Telugu Site icon

Jithender Reddy: సంచలనంగా మారిన మాజీ ఎంపీ ట్వీట్.. టి.బీజేపీకి ఇలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం..!

Jithender Reddy

Jithender Reddy

Jithender Reddy: తెలంగాణ భారతీయ జనతా పార్టీలో గత కొన్ని రోజులుగా ఏదో జరిగిపోతుంది అనే ప్రచారం సాగుతూ వస్తుంది.. దానికి అనుగుణంగా.. రాష్ట్ర బీజేపీ నేతలు కొందరు అంటీముట్టనట్టు ఉండడం.. రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లడం.. బీజేపీ పెద్దలను కలవడం.. ఆ తర్వాత వారు మాట్లాడిన తీరు చూస్తే.. అదంతా నిజమే అనిపించేలా పరిస్థితులు ఉన్నాయి.. అయితే, తాజాగా, మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి సోష్‌ల మీడియా వేదిక చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టింది.. నిజంగా తెలంగాణ బీజేపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? అనేలా చేసింది..

Read Also: Etela Rajender: ఈటల రాజేందర్ తో మేడ్చల్ డీసీపీ సందీప్ రావు భేటీ..

ఇక, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ఆ వివాదాస్పద ట్వీట్‌ విషయానికి వెళ్తే.. గేదెను ట్రాలీ ఎక్కిస్తున్న ఓ వీడియోను షేర్‌ చేశారు.. గేదెను ట్రాలీకి కట్టి.. దానిని వెనకనుంచి తన్నగానే వెంటనీ ట్రాలీలోకి ఎక్కేసింది.. ఇక, ఇలాంటి ట్రీట్‌మెంట్‌ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ ఆయన కామెంట్ రాసుకొచ్చారు.. అంతేకాదు.. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీని ట్యాగ్‌ చేసి ఆ ట్వీట్‌ చేశారు.. మొత్తంగా ఆయనకు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తన అసంతృప్తిని జితేందర్‌రెడ్డి ఇలా బయటపెట్టారనే చర్చ సాగుతోంది.. కాగా, రాష్ట్ర బీజేపీలో కీలకంగా ఉన్న కొందరు నేతలు గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్నారని.. మరికొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.. మరోవైపు.. బీజేపీ అగ్రనాయకత్వం.. తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని మార్చేందుకు కసరత్తు కూడా చేస్తుందనే చర్చ కూడా నడుస్తోంది.. ఈ సమయంలో.. జితేందర్‌రెడ్డి ట్వీట్‌ ఆసక్తికరంగా మారింది. మరి, ఆ పార్టీ నేతలు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి.

అయితే, కొద్ది సేపటి క్రితం మరో ట్వీట్‌ చేశారు జింతేదర్‌ రడ్డి.. “కేసీఆర్‌ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే… బండి సంజయ్ గారి నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార.. బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి” అంటూ ఘాటుగా రాసుకొచ్చారు.