NTV Telugu Site icon

TDP: ఉండి టీడీపీలో వర్గపోరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై మాజీ ఎమ్మెల్యే మండిపాటు

Undi Tdp

Undi Tdp

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీలో వర్గపోరు రాజుకుంది. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుపై మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివరామరాజు మండిపడ్డారు. భీమవరంలోని మాజీ ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో.. ఎన్నికల్లో ఏ మాత్రం సహకరించేది లేదంటూ స్పష్టం చేశారు. దీంతో పార్టీ ఆఫీసు నుంచి రామరాజును శివ వర్గం బయటకి పంపించింది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు వ్యతిరేకంగా శివవర్గం నినాదాలు చేశారు.

Heart attack: గుండెపోటుతో భర్త, ఏడో అంతస్తు నుంచి దూకి భార్య.. 24 గంటల్లో రెండు మరణాలు..

ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ.. తనను నియోజకవర్గంలో డిలీట్ చేయాలని చూసిన వ్యక్తికి ఎలా సపోర్ట్ చేస్తానని తెలిపారు. ఇప్పుడు నా మద్దతు కోరడం కోసం వచ్చాడు.. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనునిత్యం అవమానిస్తూనే ఉన్నాడని ఆరోపించారు. నాలో అగ్నిగుండం ఉంది.. నియోజకవర్గంలో నా పేరు ఉచ్చరించకుండా చేసాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న జరిగిన మీటింగ్ కు తనను ఆహ్వానించలేదని.. జనాన్ని మభ్యపెట్టడానికి చూస్తున్నాడని దుయ్యబట్టారు. అతను పూర్తిగా డబ్బు అహంకారంతో ఉన్నాడని పేర్కొన్నారు.

Body building: బాడీ బిల్డింగ్ కోసం ఓ యువకుడు ఏం చేశాడో తెలుసా..?

కాగా.. వచ్చే ఎన్నికల్లో తానో టీడీపీనో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు ఉండి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ. టీడీపీ ప్రకటించిన తొలి జాబితాలో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజుకు మరో అవకాశాన్ని కల్పించడానికి మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కించుకున్న రామరాజు మాజీ ఎమ్మెల్యే మద్దతు కోరేందుకు భీమవరంలోని అతని కార్యాలయానికి వెళ్లారు. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే శివ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు పై ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ఏ మాత్రం సహకరించేది లేదంటూ స్పష్టం చేశారు. దీంతో ఉండి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య అగ్గిరాజుకుంది.