Site icon NTV Telugu

Former MLA Narsa Reddy: మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..

Narsareddy

Narsareddy

Former MLA Narsa Reddy: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించాడంటూ గజ్వేల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం మంత్రి వివేక్ పర్యటన సందర్భంగా నర్సారెడ్డి, శ్రీకాంత్ రావు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కాంగ్రెస్ నాయకులు గల్లాలు పట్టుకుని చొక్కాలు చినిగేలా కొట్టుకున్నారు. అదే రోజు మాజీ సర్పంచ్ కుమారుడిపై డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి చేయి చేసుకున్నారు.

READ MORE: Cloudburst in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం!

కాగా.. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో రెండ్రోల కిందట రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి వివేక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై మంత్రితో పాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్‌పర్సన్ బక్కి వెంకటయ్య, జిల్లా కలెక్టర్ హైమావతి, అదనపు కలెక్టర్లు, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిలు ఉన్నారు. అయితే గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించలేదు. కాగా కార్యక్రమం మొదలవుతున్న సందర్భంలో స్టేజీ కింద ఉన్న కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఘర్షణలో మాజీ సర్పంచ్ కుమారుడిపై ఆయన చేయిచేసుకున్నారు.

Exit mobile version