NTV Telugu Site icon

Jaggareddy: బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుంది..

Jaggareddy

Jaggareddy

బీఆర్ఎస్, బీజేపీపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధాంతాలు చెప్పే పార్టీలు డూప్లికేట్ పార్టీలు అని విమర్శించారు. మాట మీద నిలబడి సెక్యులర్ మాటకు కట్టుబడి ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ అవకాశవాద రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కి సిద్ధాంతాలు లేవని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయకారి ఒప్పందంలోనే కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. కొత్త నాటకంకు రెండు పార్టీలు తెర లేపారని అని పేర్కొన్నారు.

Read Also: Telangana Media Academy: మీడియా అకాడమీ ఛైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి..

కాంగ్రెస్ ఓట్లు చీల్చాలి అనేది బీఆర్ఎస్, బీజేపీ ఆలోచన అని జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మాటలకు బీజేపీలో విలువ లేదని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు ఉంటే చెప్పుతో కొట్టండి అనేది డ్రామా అని ఆరోపించారు. వాళ్ళ మాటలకు విలువ లేదు.. కవిత అరెస్ట్ ఎపిసోడ్.. రాహుల్ గాంధీ ప్రధాని కావద్దని కుట్రలో బీఆర్ఎస్ ఒక పావుగా తయారైందని చెప్పారు.

Read Also: Chellluboina Venugopal: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాపై మంత్రి చెల్లుబోయిన సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఎక్కడా లేరని జగ్గారెడ్డి అన్నారు. కనీసం నాడు పార్లమెంట్‌లో ఎంపీగా కూడా లేరని గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడింది కేవలం కాంగ్రెస్ ఎంపీలే అని తెలిపారు. స్వరాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ పార్టీ పెట్టలేదని ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడం వారికి తేలిక అని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టే కుట్రలో బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఉందన్నారు.