NTV Telugu Site icon

YSRCP: వైసీపీకి షాక్.. పార్టీకి ఆమంచి కృష్ణమోహన్ గుడ్‌బై

Amanchi Krishna Mohan

Amanchi Krishna Mohan

YSRCP: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల వేళ బాపట్ల జిల్లా చీరాలలో వైసీపీకి షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ రాజీనామా చేశారు. చీరాల వైసీపీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆమంచి కృష్ణమోహన్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెల 9న తన భవిష్యత్ ప్రకటిస్తానని ఆమంచి వెల్లడించారు. గతంలో పర్చూరు నియోజకవర్గ బాధ్యతలు నిర్వహించిన ఆమంచి కృష్ణమోహన్‌కు టికెట్ దక్కలేదు. దీంతో గత కొంతకాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ 2014లో చీరాల నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2019 ఫిబ్రవరిలో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు .

Read Also: Andhra Pradesh: ఏపీలో పలు జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు నియామకం

టికెట్ రాకపోవడంతోనే.. 

ఆమంచి కృష్ణమోహన్‌ ఈ ఎన్నికల్లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆమంచి భావించారు. అయితే ఈ టికెట్ కరణం వెంకటేశ్‌కు ఇవ్వడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చీరాల వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ మేరకు ఆమంచి కృష్ణమోహన్‌ను పర్చూరు ఇంచార్జిగా నియమించారు. అయితే ఇటీవల పర్చూరు అభ్యర్తిగా యెడం బాలాజీని నియమించారు. దీంతో వరుస ఎదురుదెబ్బలు తగలడంతో వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు గురువారం పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో కాంగ్రెస్ లో చేరతారని.. ఆ పార్టీ అభ్యర్థిగా చీరాల నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని వార్తలు వినిపిస్తున్నాయి.

Show comments