Perni Nani: కొల్లు రవీంద్రకు దేవుడు ఒక శాపం ఇచ్చాడని అది సిగ్గు లేకుండా మాట్లాడటమని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. బందరు అభివృద్ధిలో నువ్వు చేసింది ఏమిటో నేను చేసింది ఏమిటో శ్వేత పత్రం విడుదల చేద్దామా అంటూ నాని కొల్లు రవీంద్రకు సవాల్ విసిరారు. సామాజిక సాధికారిక యాత్ర విజయంతంపై పట్టలేనంత కోపం ఈర్ష్య, ద్వేషంతో తన కడుపు మంటతో అంత అబద్ధాలు మాట్లాడుతూ తీర్చుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. మదరాసు స్థలంపై ఒక సంస్థకు యిచ్చే స్థలం ఒక వ్యక్తి పేరు మీద అది కూడా మీ పార్టీ కౌన్సిలర్ కుమారుడి పేరు మీద ఇచ్చావంటూ ఆరోపించారు. పోర్ట్ విషయంలో కట్టని పోర్టుకి 8.70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావ్, కనీసం పైలాన్ కట్టిన స్థలం కూడా ఒక పేద రైతు వద్ద బలవంతంగా లాక్కున్నారని విమర్శలు గుప్పించారు.
Read Also: Ministe RK Roja: ఇంత బడ్జెట్‌తో ఏ ప్రభుత్వం ఇప్పటివరకూ క్రీడలు నిర్వహించలేదు..
పేద ప్రజల స్థలాలు తీసుకొని 11 వేల ఎకరాలలో పోర్ట్ అని ఎలక్షన్ కోడ్ వచ్చే 10 రోజుల ముందు శంకుస్థాపన చేశావంటూ మండిపడ్డారు. మెడికల్ కాలేజీ నా హయంలో అంటున్నావు ఏ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్, కనీసం ఒక్క జీఓ అయిన యిచ్చావా అయితే చూపించు అంటూ ప్రశ్నించారు. ఈరోజు పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటే పేర్ని నాని,జగన్మోహన్ రెడ్డి చలువ కదా అంటూ తెలిపారు. ఎవరో బతుకుదెరువు కోసం వచ్చిన ఒకడు రాసిన స్క్రిప్ట్ నీ చదువుతూ అబద్ధాలు చెప్పడం కాదన్నారు. ఇప్పటి వరకు బస్సు యాత్ర బాగానే జరిగింది అని అనుకుంటున్నాము, కానీ నీ ఏడుపు చూసి బ్రహ్మాండంగా జరిగిందని అనుకుంటున్నామన్నారు. సిగ్గులేని రాజకీయాలు ఆపి నిజాయితీ రాజకీయాలు చేయాలన్నారు.