NTV Telugu Site icon

KTR: రేవంత్‌రెడ్డి ధన దాహం వల్లే.. ప్రమాదంలో 8 మంది కార్మికుల ప్రాణాలు!

Ktr

Ktr

తన అసమర్థతను, పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపైన నెపం నెడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. జీఎస్‌ఐ, ఇంజనీరింగ్ నిపుణులు వంటి సంస్థలతో సంప్రదించకుండానే ఆగిపోయిన ప్రాజెక్టుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా అవినీతి సొమ్ముల కోసం లాలూచీ పడి పాత యంత్రాలతో ప్రారంభించారని విమర్శించారు. కేవలం రేవంత్ రెడ్డి ధన దాహం వల్లనే ఈరోజు 8 మంది కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నారని ఆరోపించారు. వారు బతికున్నారో లేదో అనే ఆందోళనకరమైన పరిస్థితి నెలకొందన్నారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే అన్నారు. రేవంత్ రెడ్డి కార్మికులను రక్షించాల్సింది పోయి బ్లేమ్ గేమ్ ప్రారంభించారని ఆరోపించారు. దేవుడిచ్చిన ముఖ్యమంత్రి అవకాశాన్ని వాడుకొని ప్రజలకు మంచి చేయాల్సింది పోయి రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చింది కాబట్టి తెలంగాణకు మంచి జరిగేలా ప్రజలకు మంచి జరిగేలా వ్యవహరించాలని సూచించారు. చీఫ్ మినిస్టర్ గా మాట్లాడాలి కానీ ఒక చీప్ మినిస్టర్ గా మాట్లాడవద్దని రేవంత్ రెడ్డికి సూచిస్తున్నాన్నారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకాకనే రాష్ట్రంలో జరుగుతున్న మరణాలపైన ఇతరుల పేరును ప్రస్తావిస్తున్నారని చెప్పారు.

READ MORE: Sam Pitroda: అశ్లీల వీడియోలపై పిట్రోడా సంచలన ఆరోపణలు.. తిప్పికొట్టిన కేంద్ర విద్యాశాఖ

అధికారంలో తామే ఉన్నామన్నది మరిచిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. “రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే కావాల్సిన విచారణలు దర్యాప్తులు చేసుకోవచ్చు. కానీ కేవలం టైంపాస్ చేసేందుకు పరిపాలనను పక్కనపెట్టి చేతకాకనే ఇవన్నీ మాట్లాడుతున్నారు. అరచేతిలో స్వర్గం చూపించేలా ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాకనే ప్రజల టెన్షన్ డైవర్షన్ కోసం ముఖ్యమంత్రి ఇవన్నీ మాట్లాడుతున్నారు. 15 నెలల నుంచి కేవలం ప్రజల అటెన్షన్ డైవర్షన్ పేరుతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి పాలనను పక్కనపెట్టారు. రేవంత్ రెడ్డి అన్ని విషయాల్లో అబద్ధాలు ఆడుతున్నారు. రాష్ట్ర అప్పుల విషయంలో కూడా అబద్ధాలు ఆడుతున్నారు. 6500 కోట్లు కేవలం వడ్డీ లెక్క అయిపోతుందంటూ రాష్ట్ర ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఆర్థిక వ్యవస్థ గురించి అవగాహన లేదు.” అని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు.

READ MORE: CM Revanth Reddy: “తెలంగాణ రైజింగ్‌ను ఎవరూ ఆపలేరు”.. HCL టెక్ క్యాంపస్ ప్రారంభించిన సీఎం..