Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం..

  • కూటమి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తాం
  • పెట్రోల్ బాంబులు, యాసిడ్ తో దాడి చేయడాన్ని ఆయన ఖండించారు
  • తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కీ విధేయుడు రమేష్
Kakani Govardhan Reddy

Kakani Govardhan Reddy

కూటమి ప్రభుత్వ అక్రమాల పై రాజీలేని పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తాం గానీ, రాజీ పడమని వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో టీడీపీ నాయకుల దాడిలో దెబ్బతిన్న జోగి రమేష్ ఇంటినీ పరిశీలన చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేతల పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన అధికారులకు నజరాన ఇచ్చి ప్రమోషన్లు ఇస్తున్నారని పేర్కొన్నారు.

Also Read:Peddi Second Song: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘పెద్ది’ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడంటే!

రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ బాంబులు, యాసిడ్ తో దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. జోగి రమేష్ కుటుంబ సభ్యుల పై కూడా కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడం సరికాదని పేర్కొన్నారు. తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కీ విధేయుడు రమేష్ అని, ఎప్పుడు అండగా ఉంటామని తెలిపారు.