Hari Rama Jogayya: మాజీ మంత్రి హరిరామ జోగయ్య మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. జనసేన-టీడీపీ- బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై పవన్ కళ్యాణ్‌తో చర్చించడం జరిగిందని ఆయన వెల్లడించారు. 40 నుంచి 60 సీట్లు జనసేన దక్కించుకోవలసి ఉందని చెప్పగా.. 40 సీట్ల వరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పవన్ తెలిపారన్నారు.
Read Also: Bolisetti Srinivas: పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారు..
పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్న విషయాన్ని వివరించానని.. కనీసం రెండున్నర ఏళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. జనసేన గౌరవానికి ఏ మాత్రం భంగం కలగకుండా ఉంటుందని పవన్ ఆశిస్తున్నారని, జనసేన టీడీపీ కూటమిలో త్వరలో బీజేపీ చేరే అవకాశం ఉందని పవన్ తనకు తెలిపినట్లు మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. ఈ మేరకు శనివారం హరిరామజోగయ్య ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా 40 నుంచి 60 సీట్లు కోరాలని పవన్‌కు సూచించానని తెలిపారు. గతంలోనూ హరిరామ జోగయ్య ఇదే విధంగా బహిరంగ లేఖ విడుదల చేయడం గమనార్హం.