Site icon NTV Telugu

Jagadish Shettar: కర్ణాటక కాంగ్రెస్ కు బిగ్ షాక్.. బీజేపీలోకి జగదీష్ షెట్టార్..

Shettar

Shettar

BJP: కర్ణాటకలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ తిరిగి బీజేపీలో చేరారు. అయితే, కర్ణాటకలో ఆధిపత్య లింగాయత్ కమ్యూనిటీకి ప్రధాన నాయకుడిగా షెట్టర్ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సమక్షంలో షెట్టర్ మళ్లీ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే, గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున టిక్కెట్ రాకపోవడంతో ఏప్రిల్‌లో కమలం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

Read Also: Bandi Sanjay: గల్లీలో ఎవరున్నా సరే.. ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలి..!

అయితే, జగదీష్ షెట్టర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. హుబ్లీలోని ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయగా.. భారీ ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి మహేష్ తెంగినాకై చేతిలో ఓడిపోయారు. ఇక, గత ఏడాది కాంగ్రెస్‌లో చేరిన తర్వాత తనకు అధికారంలో ఉండాలనే కోరిక లేదని జగదీశ్ శెట్టర్ చెప్పడం గమనార్హం.

Read Also: OTT Release movies: సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 17 సినిమాలు రిలీజ్..

ఇక, 80వ దశబ్దంలో రాజకీయాల్లోకి వచ్చిన జగదీష్ షెట్టార్ 2012 నుంచి 2013 మధ్య సుమారు పది నెలల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతే కాకుండా 6 సార్లు ఎమ్మెల్యేగా, బీజేపీలో అనేక పదవులను చేపట్టారు. ఇందులో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశాడు. 2008లో రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడంతో కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌గా కూడా షెట్టార్ బాధ్యతలు నిర్వహించారు.

Exit mobile version