Razole Assembly: ఉత్కంఠకు తెర.. రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Razole Assembly: గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకేఒక్క స్థానంలో విజయం సాధించింది.. అదే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం.. అప్పట్లో విజయం సాధించిన రాపాక వరప్రసాద్.. అక్రమంగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చారు.. ఆ పార్టీలో చేరారు.. ఇప్పుడు ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అయితే, ఈ సారి రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు అనేదానిపై ఉత్కంఠ వీడింది. రాజోలు అభ్యర్థిగా.. మాజీ ఐఎఎస్ దేవ వరప్రసాద్‌ను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. ఇక, దేవ వరప్రసాద్ స్వగ్రామం మలికిపురం మండలం దిండి గ్రామం. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఓడి పోయి జనసేన పార్టీలో చేరిన బొంతు రాజేశ్వరరావు నిన్నటివరకు రాజోలు టికెట్ వస్తుందని ఆశించారు.. ఇప్పుడు దేవా వరప్రసాద్‌ను జనసేన అభ్యర్థిగా ప్రకటించడంతో.. బొంతు వర్గం నిరాశలో ఉంది.
Read Also: IPL 2024: ముంబై ఇండియన్స్ ఎంత కసితో ఉందో అర్థమవుతోంది: అశ్విన్
Also Read
అయితే, రాజోలు నియోజకవర్గానికి జనసేన పార్టీలో ఒక ప్రత్యేక అనుంబంధం ఉందని చెప్పవచ్చు.. రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో జనసేకు ఎదురుగాలి వీచినా.. రాజోలులో మాత్రం జనసేన జెండా ఎగిరింది.. రాజోలు నియోజకవర్గ ప్రజలు ఆ స్థానం నుంచి జనసేన తరఫున పోటీ చేసిన రాపాక వరప్రసాద్‌కి విజయాన్ని కట్టబెట్టారు.. కానీ.. ఆయన క్రమంగా జనసేనకు దూరమవుతూ.. వైసీపీకి చేరువయ్యారు.. దీంతో, జనసేన చేతి నుంచి ఆ ఒక్క సీటు కూడా చేజారిపోయినట్టు అయ్యింది.. కానీ, ఈ సారి రాజోలు స్థానంపై ప్రత్యేక దృష్టి సారించారు జనసేనాని పవన్ కల్యాణ్.. ఈ ఎన్నికల్లో మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకునేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.. రాజోలు నియోజకవర్గంలో జనసేన జెండా మళ్లీ ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!