Kirankumar Reddy: గతంలో టీడీపీ ప్రభుత్వం రూ.40వేల కోట్లు అప్పులు చేసిందని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్ ప్రభుత్వంలో కూ.315 కోట్లు మాత్రమే అప్పులు చేశామని ఆయన తెలిపారు. ఈ పదేళ్ల కాలంలో ఎన్ని వేల కోట్లు అప్పులు చేస్తున్నారో అంతుబట్టడం లేదన్నారు. తెలంగాణలో ప్రభుత్వమే హ్యాపీగా ఉంది.. అక్కడ ప్రజలు,రాజకీయ పార్టీలు కాదని ఆయన ఆరోపించారు. సంక్షేమ పథకాలు ప్రజల అభివృద్ధికి మార్గాలు వేసేవిగా ఉండాలన్నారు. బీజేపీ లీడర్‌షిప్ బలంగా ఉందని, దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ పుంజుకుంటోందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ఈవీఎంల మీద ఉన్న అపోహలు తొలగిపోయాయన్నారు. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కీలకంగా మారుతుందని ఆయన అన్నారు.
Also Read: Bjp Meeting: మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో బీజేపీ నేతల భేటీ.. పార్టీ బలోపేతంపై చర్చలు..!
ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే తిరిగి యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చానని కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ డైరెక్షన్ నచ్చకే దూరం అయ్యానని….బీజేపీ ఒక్కటే తనకున్న ఆప్షన్ అంటూ చెప్పుకొచ్చారు. రైతులు, మహిళా సంఘాలకు జీరో వడ్డీ అనేది ఏపీ, తెలంగాణలో పేపర్లకే పరిమితమయ్యాయని ఆయన విమర్శించారు. క్రాప్ లోన్స్ కూడా సక్రమంగా అందడం లేదన్నారు. సంక్షేమ పథకాల వల్ల పేదలకు శాశ్వత ప్రయోజనం చేకూర్చడం ప్రభుత్వం బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆఖరి ప్రభుత్వంలో కొత్తగా 80వేల ఉద్యోగాలు కల్పించామని.. గడిచిన 9ఏళ్లలో రేండు రాష్ట్రాలలో నియామకాలు ఏ విధంగా జరిగాయో ఆలోచించాలని మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
