భూ కుంభకోణంతో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ శుక్రవారం విడుదలయ్యారు. ఆయన ఈ కేసులో అయిదు నెలలు జైలులో ఉన్నారు. ల్యాండ్ స్కామ్ కేసులో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపిస్తూ ఈడీ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. ఈ కేసులోనే ఈ రోజు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.హేమంత్ సొరేన్ ప్రస్తుతం జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనకు బెయిల్ మంజూర్ కావడంపై పార్టీ శ్రేణులు ఆనందోత్సాహాలతో మిఠాయిలను పంచుకున్నారు. సోరెన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు జనవరి 31న అరెస్టు చేశారు. సోరెన్ ను అన్యాయంగా టార్గెట్ చేశారని, ఆయనపై పెట్టింది రాజకీయ ప్రేరేపిత, కల్పిత కేసు అని ఆయన తరఫు న్యాయవాది, సీనియర్ అడ్వొకేట్ మీనాక్షి అరోరా వాదించారు.
READ MORE: Rahul Gandhi: ప్రతిపక్ష నేత మాట్లాడుతుండగా మైక్ కట్.. ఎక్స్‌లో వీడియో షేర్
ఈడీ వాదనలు ఇలా..
జార్ఖండ్ రాష్ట్ర రాజధానిలో 8.86 ఎకరాల భూమిని సేకరించడానికి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న హేమంత్ సొరేన్ తన పదవిని దుర్వినియోగం చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తెలిపింది. అక్రమ భూదందాలో హేమంత్ సోరెన్ ప్రమేయాన్ని సాక్షులు ధృవీకరించారని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు తెలిపారు. భూ యాజమాన్య వివరాలను మార్చడానికి అధికారిక రికార్డులను తారుమారు చేయాలని మాజీ సీఎం ఆదేశించారని సోరెన్ మీడియా కన్సల్టెంట్ అభిషేక్ ప్రసాద్ అంగీకరించారని ఈడీ వెల్లడించింది. జనవరి 31న హేమంత్ సోరెన్ ను అరెస్టు చేయడానికి ముందు ఈడీ పలుమార్లు ఆయనకు సమన్లు జారీ చేసింది.
READ MORE: DELHI: నీట్ అవకతవకలపై పార్లమెంట్ లో విపక్షాల నిరసన..స్పృహ తప్పిపడిపోయిన రాజ్యసభ ఎంపీ..
సొరేన్ తరఫున న్యాయవాది ఏమన్నారంటే..
ఈడీ ఆరోపిస్తున్న భూ కబ్జా ఆరోపణలు మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కిందకు రావని హేమంత్ సొరేన్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టు ముందు వాదించారు. ఒకవేళ, ఆ ఆరోపణలు నిజమైనా, అవి ఆస్తి హక్కుకు సంబంధించిన సివిల్ వివాదం అవుతుందే తప్ప క్రిమినల్ కేసు కాదని ఆయన వాదించారు. సోరెన్ ను జైల్లో పెట్టాలన్న దురుద్దేశంతోనే ఈ క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరిగాయని కపిల్ సిబల్ ఆరోపించారు. ఎట్టకేలకు ఆయన అయిదు నెలల తర్వాత జైలు నుంచి బయటకు వచ్చారు.