Tej Pratap Yadav: బీహార్ మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి చేరిక

Tej Pratap Yadav

Tej Pratap Yadav

Tej Pratap Yadav: బీహార్ మాజీ మంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఛాతీ నొప్పితో బాధపడుతూ శుక్రవారం ఆసుపత్రిలో చేరారు. రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ పాట్నాలో రాజేంద్ర నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. గురువారం తేజ్ ప్రతాప్ బక్సర్ ప్రాంతంలో పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించేందుకు వచ్చారు.

Read Also: Congress: ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్

×
×
Ad

గతంలో బీహార్‌లో జరిగిన మహాఘటబంధన్ ప్రభుత్వంలో తేజ్ ప్రతాప్ యాదవ్ పర్యావరణ మంత్రిగా ఉన్నారు. ఆయన మరో టర్మ్‌లో ఆరోగ్య శాఖ పోర్ట్‌ఫోలియోను కూడా నిర్వహించారు. ఆయనకు వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆర్జేడీ నేతలు కోరుకుంటున్నారు.