NTV Telugu Site icon

Forest Officials Seize Deers : కాంగ్రెస్ నేత ఫాంహౌస్ లో జింకలు, అడవిపందులు

Deers

Deers

Forest Officials Seize Deers : కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుని వ్యవసాయ క్షేత్రంలో అక్రమంగా ఉంచిన పలు వన్యప్రాణులను అటవీ అధికారులు రక్షించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడు ఎస్‌ఎస్ మల్లికార్జున్ కల్లేశ్వర్ ఫామ్‌హౌస్‌లో అక్రమంగా ఉంచిన అనేక వన్యప్రాణులను కర్ణాటక అటవీ శాఖ రక్షించింది.

Also Read : Naatu Naatu Song Shortlisted For Oscar Awards: ఆస్కార్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ఆర్ నాటు నాటు సాంగ్

కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంనూర్ శివశంకరప్ప కుమారుడైన ఎస్ఎస్ మల్లికార్జున్ కల్లేశ్వర్‌కు దావణగెరెలోని ఆనెకొండలో ఫామ్‌హౌస్‌ ఉంది. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఫారెస్ట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ జంతువులను అక్రమంగా ఉంచినట్లు గుర్తించారు. దీంతో 10 కృష్ణజింకలు, ఏడు మచ్చల జింకలు, ఏడు అడవి పందులు, మూడు ముంగిసలు, రెండు నక్కలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read : Rajasthan Woman Gave Birth For Triplets : ఒక్కరి కోసం ట్రై చేస్తే ఏకంగా ముగ్గురూ మొనగాళ్లే

ఫారెస్ట్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, దావణగెరెలోని ఆనెకొండ వద్ద రైస్ మిల్లు వెనుక ఉన్న ఫామ్‌హౌస్‌లో 10 కృష్ణజింకలు, ఏడు మచ్చల జింకలు, ఏడు అడవి పందులు, మూడు ముంగిసలు, రెండు నక్కలు కనిపించాయి. కొన్ని వన్యప్రాణులను పెంచుకోవడానికి మాత్రమే అనుమతి తీసుకున్నారని, అయితే దానికి విరుద్ధంగా మరికొన్ని జంతువులను చట్టవిరుద్ధంగా పెంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు చేశామని, కేసు నమోదుచేశామని వెల్లడించారు.

Show comments